వ్య‌భిచారాణికి మ‌ధ్యవ‌ర్తిగా మారిన ప్రొఫెస‌ర్‌

Update: 2018-09-07 14:06 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ తమిళనాడులో మ్యాథ్స్ బోదించే మహిళా ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన మహిళా ప్రొఫెసర్‌ విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించ‌డం...ఆ విద్యార్థులు త‌మ ఆవేద‌న‌లో మొద‌ట్లో త‌మ‌లోనే దాచుకున్న‌ప్ప‌టికీ..అనంత‌రం శృతిమించ‌డంతో ఇత‌రుల‌కు పంచుకోవ‌డం క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. కాలేజీలో నలుగురు అమ్మాయిల్ని శృంగారంలోకి దించేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న ఉదంతంలో ఆమె మాట్ల‌డిన ఆడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళితే...చెన్నైలోని విరుదునగర్‌ జిల్లా అరుప్పు కోట్టైలోని దేవాంగ ఆర్ట్స్‌ కళాశాలలో మూడువేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలో అదే ప్రాంతానికి చెందిన నిర్మలాదేవి 15 ఏళ్లుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు. మదురై యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారులకు ‘సన్నిహితంగా’ మెలగాల్సిందిగా, డిగ్రీ పట్టాలు కావాలంటే అధికారుల సెక్స్ కోర్కెలు తీర్చాలని ప్రొఫెసర్ నిర్మలాదేవి నలుగురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.  మధురై కామరాజ్ అధికారుల కోర్కెలు తీరిస్తే - డిగ్రీ పట్టాలతో పాటు ఆర్థిక లాభాలు కూడా జరుగుతాయని ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. విద్యార్థులకు ఫోన్‌ లో ఓ ఆడియో మెసేజ్‌ ను పంపించింది. ఆ ఆడియో మెసేజ్‌ ను విద్యార్థులు ఆన్‌ లైన్‌ లో లీక్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ చ‌ర్చ‌ల‌కు సంబంధించిన ఆడియో వాట్సాప్‌ లో వైర‌ల్ అవ‌డంతో ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ విచారణకు ఆదేశించారు. అయితే, విద్యార్థినులతో మాట్లాడింది నిజమేనని, వాట్సాప్‌ లో వైరలైనది తన గొంతుకనే అని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి గ‌తంలో అంగీకరించారు. అయితే తన మాటల్లో దురుద్దేశం లేదని - కొన్ని మాటలను కత్తిరించి తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేశారని ఆమె ఆరోపించారు.

కాగా, నిర్మలా దేవికి ప్రయోగశాలలో వాయిస్ టెస్టింగ్ పరీక్షలు నిర్వహించారు. కేసు విచారణ చేస్తున్న సీబీసీఐడీ అధికారులు 200 పేజీలకు పైగా చార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో సమర్పించారు. నిర్మలా దేవి కేసు విచారణ సెప్టెంబర్ 10వ తేదీ లోపు పూర్తి చెయ్యాలని జులై నెలలో సీబీసీఐడీ అధికారులకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మలా దేవితో పాటు మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెస్ మురుగన్ - స్కాలర్ విద్యార్థి కరుప్పుస్వామిని ఇప్పటికే అరెస్టు చేశారు.
Tags:    

Similar News