తమిళుల దృష్టిని మరోసారి ఆకర్షిస్తోంది ఆ తమిళ పంచాంగం. తీవ్ర ఆనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరి.. 75 రోజుల పాటు పోరాటం చేసిన మృత్యువుతో ఓడిన అమ్మ అచేతనంగా ఉన్నవేళ.. ఆసుపత్రిలో వారసత్వ ఘర్షణ అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే.. ఇలాంటి పరిస్థితి ఒకటి చోటు చేసుకుంటుందన్న విషయాన్ని ఒక తమిళ పంచాంగం పేర్కొనటం. ఏ రోజు అయితే.. ఆ మాటను పేర్కొందో.. సరిగ్గా అదే రోజున అలాంటి పరిస్థితే చోటు చేసుకోవటంతో అందరి దృష్టి ఆ పంచాంగం మీద పడింది.
అమ్మ మరణించిన వేళ.. పంచాంగంలో చెప్పినట్లే జరగటంతో అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అదే పంచాంగం గురించి మరోసారి మాట్లాడుకునే పరిస్థితి. అమ్మ మరణం రోజున ఎలాంటి వాతావరణం ఉంటుందన్న విషయాన్ని పేర్కొన్నట్లే.. ఫిబ్రవరి 14న ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయానికి తగ్గట్లే తాజాగా జరగటంతో సదరు పంచాంగం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.
అక్రమాస్తుల కేసులో చిన్నమ్మను దోషిగా సుప్రీం నిర్ధారించిన వేళ.. సదరు పంచాంగంలో ఫిబ్రవరి 14న ఎలాంటి కొటేషన్ రాశారా? అన్నది చూస్తే.. ‘‘న్యాయమూర్తి కన్నా కాలమే నిజాన్ని వెలుగులోకి తెస్తుంది’’ అని ఉంది. 20 ఏళ్ల క్రితం పెట్టిన కేసుకు సంబంధించిన తుది తీర్పుకు సంబంధించిన పరిణామాన్ని ముందే ఊహించిన పంచాంగం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/