టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ జీవితంలో ఇప్పటి వరకు ఎదురు కాని.. తీవ్ర సంశయాత్మక పరి స్థితి ఏర్పడింది. పార్టీ కీలకనేతలు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కోవడం.. జగన్ సర్కారు దూకుడుగా వ్యవ హరించడం.. అక్రమ కేసులు బనాయించడం.. జైళ్లపాల్చేయడం.. వంటి పరిణామాలు.. చంద్రబాబును తీవ్రంగా కలచి వేస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబుకు కానీ.. పార్టీకి కానీ.. ఏదైనా.. అయితే.. మాట్లాడేందు కు.. జగన్‌ను నిలదీసేందుకు జనసేన సహా కమ్యూనిస్టులు తోడొచ్చారు.
ఇక, బీజేపీలోని విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్.. వంటి నాయకులు కూడా ముందుకు వచ్చేవారు. అదేసమయంలో టీడీపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన.. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు కూడా .. టీడీపీ తరఫున.. వాయిస్ వినిపించేవారు. పార్టీలతో సంబంధం లేకుండా.. జగన్‌పై నిప్పులు చెరిగే వారు. అంతేకాదు.. టీడీపీపై జరిగిన దాడిని లేదా.. అక్రమ కేసులను నిరసించేవారు. అయితే.. ఇప్పుడు గడిచిన ఆరు మాసాలుగా చూసుకుంటే.. టీడీపీని సమర్ధిస్తున్నవారు.. టీడీపీకి ఏదైనా జరిగితే.. ముమున్నామంటూ.. తోడుగా వచ్చేవారు కూడా కరువయ్యారు.
తాజాగా దేవినేని ఉమాపై ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టినా.. ఒక్క టీడీపీ తప్ప.. ఇతర పార్టీల్లోని టీడీపీ సానుభూతి పరులు ఎవరూ కూడా నోరు మెదపలేదు. దీనిని ఎలా చూడాలి? ఎందుకు ఇలా జరుగుతోంది? అనేది కీలకంగా మారింది. నిజానికి చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై ఎంత ధైర్యం ఉందో.. అదేవిధం గా తనను సమర్ధించేవారిపైనా ఆయనకు విశ్వాసం ఎక్కువ. తనను, తన పార్టీని సమర్ధించేవారిని ఆయన కోరుకుంటారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారిపోయింది. టీడీపీని సమర్ధించేవారు.. నేతల అరెస్టులను బలంగా ఖండించేవారు లేక పోవడం గమనార్హం.
ఇది నిజంగానే చంద్రబాబు పొలిటికల్ ఇండస్ట్రీలో పెద్ద వార్ సీన్‌నే తలపిస్తోందని అంటున్నారు పరిశీల కులు. మరి దీనికి కారణం ఏంటి? అంటే..రెండు రీజన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. రాను రాను టీడీపీ గ్రాఫ్ పడిపోతుండడం.. రెండు.. చంద్రబాబును సమర్ధిస్తే.. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దూరమవుతామేమోననే సందేహం.. నేతలను వెంటాడుతోందని తెలుస్తోంది. గడిచిన స్థానిక ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికలోనూ టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది.
దీంతో వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుందా? అనవసరంగా.. వైసీపీతో గొడవ ఎందుకు? అనుకునేవారు కనిపిస్తున్నారు. దీంతో బాబును సమర్ధించేవారు.. టీడీపీకి మద్దతుగా మాట్లాడేవారు.. కరువయ్యారని అంటున్నారు. ఇక, కమ్యూనిస్టులను జగన్ తనవైపు తిప్పుకోవడం(కామ్రేడ్ల వ్యాపారాలకు ప్రభుత్వం సహకరిస్తోంది) వంటివి కూడా బాబుకు తలనొప్పిగా మారిందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.