ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిపించిన ఓ సర్వేలో తెలుగు దేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ ర్యాంకింగులు ఇచ్చారు. ఎమ్మెల్యేల ఈ మెయిళ్లకు ఈ సర్వే రిపోర్టును పంపారు. సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది. ఈ విషయాన్ని పార్టీ విస్త్రృతస్థాయి సమావేశంలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే వెల్లడించారు.
పింఛన్ల పంపిణీలో విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడుకు మొదటి స్థానం దక్కింది. ఎపిలో రుణమాఫీ చేశామని ప్రభుత్వ అధి నేతలు ఘనంగా చెప్పుకుంటున్నా, తెలుగు దేశం పార్టీ అంతర్గత సర్వేలో మాత్రం దానికి తక్కువ రేటింగ్ రావడం విశేషం. దీని ప్రకారం కేవలం 28 శాతం మంది మాత్రమే ఎపిలో రుణమాఫీ అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 72శాతం మంది అసంతృప్తితో ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే రాష్ట్రంలో రేషన్, పింఛన్‌ల అమలు పై అత్యధిక సంతృప్తి వ్యక్తం అయింది. 76శాతం మంది ఓకే చేశారు. కాగా ఎమ్మెల్యేల పనితీరుపై 33శాతం మంది బాగుందని, 39 శాతం మంది పర్వాలేదని, మిగిలినవారు బాగోలేదని పేర్కొన్నారు. కాగా జన్మభూమి కమిటీల తీరుపై అత్యధికులు పెదవి విరిచారు.ఎన్.టిఆ.ర్ .ఆరోగ్య బీమాపై 38శాతం మంది మాత్రమే బాగుందన్నారు.
ఎమ్మెల్యేలకు జిల్లాల స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో కూడా విడివిడిగా ర్యాంకులు ఇచ్చారు. ఎక్కడా టీడీపీ ఎమ్మెల్యేలకు కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే సగటున 33 శాతం మంది కార్య కర్తలు మాత్రమే ఎమ్మెల్యేల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు ఏడు ప్రభుత్వ పథకాలపై టీడీపీ సర్వే చేయించగా, వాటిపైనా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి పెల్లుబికింది. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయమై కూడా అసంతృప్తి వ్యక్తమైనట్లు టీడీపీ సర్వేలోనే తేలింది. ఇసుక పాలసీ విషయంలో కూడా ప్రజలు పెదవి విరిచారు. ఆరోగ్యశ్రీ మాత్రం కాస్త మెరుగ్గా ఉందన్నారు. పింఛన్లు, రేషన్ సరఫరాపై టీడీపీ కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.