అది జగన్ ఏజెంట్ల కమిటీ....కామెంట్ అదుర్స్

Update: 2022-10-09 17:30 GMT
ఒక వైపు అమరావతి రైతుల పాదయాత్ర జోరుగా సాగుతోంది. దాన్ని కౌంటర్ చేయడానికి అన్నట్లుగా వికేంద్రీకరణ ఉద్యమం అని విశాఖలో హడావుడి చేస్తున్నారు. లేటెస్ట్ గా నాన్ పొలిటికల్ జేఏసీ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి మాజీ ఉప కులపతి ఒకరు సారధ్యం వహిస్తున్నారు. ఇక కమిటీ మెంబర్స్ మిగిలిన వారు ఎవరో తెలియదు.

అయితే ఇలా పుట్టిందో లేదో కానీ ఆ జేఏసీ మీద టీడీపీ నుంచి హాట్ కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. విశాఖ జిల్లా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అయితే అది నాన్ పొలిటికల్  జేఏసీ కానే కాదు, జగన్  ఏజెంట్ల  కమిటీ అంటే బాగుంటుంది అని సెటైర్లు వేశారు. అందులో ఉన్న వారంతా జగన్ మనుషులే,  ఫక్తు వైసీపీ నేతలే  ఉన్నారు. వేరే పార్టీల ప్రతినిధులు అక్కడ  ఏరీ. అలాగే ఇతర సంఘాల ప్రతినిధులు కూడా లేరు కదా అని ఎత్తి చూపారు.

ఇక ఈ జేఏసీ చేసేది ఏముంటుంది అని ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. మంత్రులు చేయాల్సింది రాజీనామాలు కాదు, అభివృద్ధి. కానీ దాన్ని మానేసి రాజీనాలు చేస్తామని చెప్పడమేంటి అని లాజిక్ పాయింట్ ని బండారు పట్టుకుని ఎటాక్ చేశారు. ఉత్తుత్తి రాజీనామలలతో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న హడావుడు ఎవరిని మభ్యపెట్టడానికి అని టీడీపీ నేతలు అంటున్నారు.

విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అయితే  జేఏసీ మీద తనదైన శైలిలో  రియాక్షన్ ఇచ్చారు. అది జగన్ యాక్ష‌న్ కమిటీ అని ఆయన అభివర్ణించారు. విశాఖలో పుట్టి పెరిగిన వైసీపీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉంటూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతూంటే రాజీనామా చేయాలని  వైసీపీ ఎమ్మెల్యేలకు  ఎందుకు అనిపించలేదు అని క‌రెక్ట్ పాయింట్ లాగి చెడుగుడు ఆడేశారు.

విశాఖకు అర్జంటుగా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మరచి వికేంద్రీకరణ అంటూ కొత్త డ్రామాలకు తెర తీశారని ఆయన మండిపడ్డారు. ఈ రాజీనామాలను జనం నమ్మరని కూడా తేల్చేశారు. మొత్తానికి ఇలా పుట్టిందో లేదో కానీ వికేంద్రీకరణ జేఏసీని టీడీపీ నేతలు  ఒక్క లెక్కన ఆడేసుకుంటున్నారు

మరి నిజంగా ఈ జేఏసీ తమది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, విశాఖ ప్రజల ఆకాంక్షల మేరకే పుట్టిందని చెప్పుకోగలరా. అలా తమ చిత్తశుద్ధిని చాటుకుంటూ తగిన కార్యాచరణను రూపొందించగలదా. జనాల మద్దతు నిజంగా ఈ జేఏసీకి ఉందా. దానిని రుజువు చేయగలరా అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి. 
Tags:    

Similar News