తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఇప్పుడు సర్వే భయం పట్టుకుంది. అది కూడా ఏ సంస్ధో చేసిన సర్వే కాదు. సొంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సర్వేలనట. ఆయనే స్వయంగా సర్వే ఏమిటనుకుంటున్నారా. ఏం లేదు... తన గొంతుతో మూడు ప్రశ్నలు రికార్డు చేసి అవి నేరుగా ప్రజలకు చేరవేస్తున్నారట. ఈ ప్రశ్నలకు వారి నుంచి వచ్చే సమాధానాలను బట్టి సిట్టింగుల భవితవ్యం ఆధారపడి ఉంటుందని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఈ మూడు ప్రశ్నల్లోనూ మొదటిది మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా... రెండోది మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉన్నారా... మూడోది... మీ ఎమ్మెల్యే మీ పట్టణం - నగరానికి ఎన్నిసార్లు వచ్చారు. ఇవీ ఆ ప్రశ్నలు. వీటికి మార్కులు కూడా కేటాయించి వాటి ఆధారంగా రానున్న ఎన్నికల్లో టిక్కట్లు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ కొత్త సర్వేతో సిట్టింగుల్లో గుబులు ప్రారంభమైంది. ముఖ్యమంత్రికి వచ్చిన సమాచారం - సర్వేల పేరుతో అసలుకే మోసం చేస్తారా అనే భయం కూడా వారిని వెంటాడుతోంది. ముఖ్యమంత్రికి - జిల్లాలో తమకు వ్యతిరేకమైన వారు కుట్ర చేసి టిక్కట్టు రాకుండా చేసేందుకు ఇదో పన్నాగమని కొందరు అంటున్నారు. ఈ సర్వేను ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభించాలని - రెండు నెలల వ్యవధిలోగా దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. సిట్టింగుల్లో కొందరిని మారిస్తే వారి స్థానంలో ఎవరికి టిక్కట్టు ఇవ్వనున్నారని ముందుగానే వారికి తెలియజేసి ఇప్పటి నుంచే అన్ని సమకూర్చుకోమని చెప్తారని అంటున్నారు. ఇదే నిజమైతే రాష్ట్రంలో చాలా మంది సిట్టింగులకు టిక్కట్లు దక్కవనే ప్రచారం కూడా జరుగుతోంది. తమపైనే కాకుంగా ప్రభుత్వ పరితీరుపై కూడా సర్వే నిర్వహించాలని, వాటిని కూడా పరిగణలోకి తీసుకుని టిక్కట్టు ఇవ్వాలని ఓ వర్గం అంటోంది. రాష్ట్రంలో చంద్రబాబు పనితీరుపై ప్రజలు విసిగిపోయారని - దాన్ని వెల్లడించకుండా ఎమ్మెల్యేల పనితీరును తప్పు పట్టి వారికి టిక్కట్లు ఇవ్వకపోవడం దారుణమని వారు దుయ్యబడుతున్నారు.