టీడీపీ మీడియాను నిరాశ పరిచిన అమిత్ షా!

Update: 2019-10-22 14:30 GMT
ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  అమిత్ షా అపాయింట్ మెంట్ దక్కకూడదని తెలుగుదేశం పార్టీ మీడియా గట్టిగానే అనుకుంది. ఆ మేరకు రకరకాల కథనాలను కూడా వండి వార్చిన వైనాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. అమిత్ షాతో జగన్ సమావేశం రద్దు అయ్యిందంటూ ముందుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేసింది.

ఇటీవలే అమిత్ షాతో వెళ్లి సమావేశం అయిన ఒక మీడియాధినేత.. ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా తమకు అనుకూలంగా  రాసుకోవాలని తెగ ప్రయత్నించారు. అమిత్ షా గనుక జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే బాగుండు అన్నట్టుగా ప్రచారం చేశారు.

కట్ చేస్తే.. కేంద్ర హోం మంత్రితో ఏపీ సీఎం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాల గురించి జగన్ ప్రస్తావించడం - వాటిని ఆయన సావధానంగా వినడం జరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తర్వాతి సంగతి.

అక్కడకూ అమిత్ షా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారట. అందుకు ప్రధాన కారణం..హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ల ఎన్నికలు. వాటిల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిపై  బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో ఉన్న అమిత్ షాకు సహజంగానే టెన్షన్ ఉంటుంది.  ఆ అంశాలను ఆయన సమీక్షించుకుంటూ ఉన్నారట.

ఇలాంటి నేపథ్యంలో కూడా జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఆ బిజీలో ఉండి అమిత్ షా గనుక జగన్ ను కలవకపోయి ఉన్నట్టు  గా అయితే తెలుగుదేశం మీడియా హడావుడి ఎలా ఉండేదో అర్థం చేసుకోవడం కష్టం ఏమీ కాదు. ఒక రేంజ్ లో ఈ అంశాన్ని వాడుకునేవి. జగన్ పై అమిత్ షా చాలా కోపంగా ఉన్నాడంటూ ప్రచారానికి తెరతీసేవి. అయితే ఏపీ సీఎంకు సెంట్రల్ హోం మినిస్టర్ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు బాగా నిరాశపడినట్టుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News