నందమూరి నటసింహం.. బాలయ్య నటించిన అఖండ సినిమా ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా `బోత్ ఆర్ నాట్ సేమ్` అంటూ.. బాలయ్య పేల్చే డైలాగు మాస్‌లోకి బాగా వెళ్లిపోయింది. ఇప్పుడు ఇదే డైలాగు.. ఏపీ సర్కారుకు సెగ పెడుతోంది. ఎలాగంటే.. ఉద్యోగ సంఘాలు ఏపీ ప్రభుత్వంపై ఉద్యమించిన విషయం తెలిసిందే. తమకు ప్రకటించిన పీఆర్సీతో వేతనాలు తగ్గుతున్నాయని.. ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో సమ్మెకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా చలో విజయవాడ కనీ వినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది.
దీంతో అప్పటి వరకు బెట్టు ప్రదర్శించిన ప్రభుత్వం దిగి వచ్చింది. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపింది. దీంతో కొంత మేరకు చర్చలు జరిగాయి. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కొన్ని విషయాల్లో దిగి వచ్చి సర్దు కు పోయారు. అయితే.. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం వ్యతిరేకించాయి. ముఖ్యంగా ఫిట్‌మెంట్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని.. ప్రజాప్రతినిధుల వేతనాలు.. సలహాదారుల వేతనాలు లక్షల్లో ఉన్నప్పుడు.. తమకు ఫిట్‌మెంట్ ఎలా తగ్గిస్తారంటూ.. ప్రశ్నించా యి. అయితే.. ఈ క్రమంలో ఉపాధ్యాయ నేతలు.. ఉపాధ్యాయులు సర్కారుపై సోషల్‌మీడియా వేదిగా.. విరుచుకుపడుతున్నారు.
ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. దీనిలో అఖండ మూవీలోని బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగుతో ఏపీ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ``మేం అడిగింది ఫిట్‌మెంట్. మీరు చేస్తానంటోంది.. సెటిల్‌మెంట్.. బోత్ ఆర్ నాట్ సేమ్`` అదేవిధంగా ``మేం అడిగింది హౌస్ రెంట్.. మీరు ఇస్తానంది టెంట్ హౌస్ టెంట్.. బోత్ ఆర్ నాట్ సేమ్``, మేం అడిగింది పీఆర్సీ.. మీరు స్తానంటోంది రివర్స్ పీఆర్సీ.. బోత్ ఆర్ నాట్ సేమ్.. మేం అడిగింది సీపీఎస్ రద్దు.. మీరు చేసింది చింతా మణి రద్దు.. బోత్ ఆర్ నాట్ సేమ్.. అంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిలో కొందరు ఉద్యోగ సంఘాలు కూడా ఉండడం గమనార్హం. మొత్తానికి ఈ ఏడాదిట్రెండింగ్‌గా మారిన అఖండ డైలాగులు సర్కారు కు సెగ పెంచుతున్నాయనడంలో సందేహం లేదు.