చరిత్ర సృష్టించిన టీం ఇండియా .. సీఎం జగన్ తో పాటుగా సినీ స్టార్స్ కంగ్రాట్స్
బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తన జూలు విదిల్చింది. సిరీస్ కి కీలకమైన గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయాన్ని సాధించి భారత్ జాతీయ పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. కుర్రాళ్ల పోరాట స్ఫూర్తి తో బోర్డర్, గావస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి దక్కించుకుని ఆస్ట్రేలియాపై తమదే పైచేయి అని నిరూపించింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియాపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. హార్టీ కంగ్రాట్స్ టీమిండియా.. ఇది నిజంగా గొప్ప విజయం. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా వేదికగా టీమిండియా విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. మ్యాచ్‌లో మీరు కనబరిచిన అద్భుత ప్రదర్శన పట్ల ఈరోజు దేశం మొత్తం గర్విస్తుంది అని ట్విట్ చేశారు. దీనితో సీఎం జగన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలతో పోలిస్తే మిగతా అంశాలపై అంతగా స్పందించేందుకు ఇష్టపడని వైఎస్ జగన్ క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల విషయంలోనూ గతంలోనూ స్పందించి సందర్భాలు చాలా అరుదు. అలాంటిది భారత జట్టు ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం అందుకోవడంతో ఢిల్లీ పర్యటనకు వెళ్తూ కూడా ట్వీట్ ద్వారా టీమ్ ఇండియాకు జగన్ అభినందనలు తెలపడం విశేషం.
ఈ విజయం తో టీం ఇండియా ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. మరోసారి చరిత్ర నమోదైంది అంటూ గబ్బాను జయించారని , అలాగే 2-1తో సిరీస్ ను ముగించిన టీమిండియా చిరాకాలం గుర్తిండిపోయేలా విజయాన్ని అందించిందని, నిజంగా ఇది చాలా గర్వకారణమని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ టీమిండియా జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఇంత గొప్ప విజయం అందుకున్న టీమిండియాకు కంగ్రాట్స్. ఈ విజయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు అంటూ చరిత్ర సృష్టించారని అన్నారు. ఇక వెంకటేష్ అయితే ఏకంగా టీవీలో భారత జట్టు విజయాన్ని సెల్ఫీ తీసుకుంటూ టీమిండియా అమేజింగ్ అంటూ ట్వీట్ చేశారు. నేడు జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో ఇండియా జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఇక టీమ్ సభ్యులందరికి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు.
ఇక , టీమిండియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం చిరస్మరణీయంగా మిగిలిపోతుందని, ఈ సందర్భంగా కెప్టెన్ రహానేతో పాటు జట్టు సభ్యులను కేసీఆర్ అభినందించారు. టీమిండియా విజయంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం.. టీమిండియా ఆటగాళ్లు భారత్ ను గర్వించేలా చేశారు. కీలక ఆటగాళ్లు లేకున్నా కుర్రాళ్లతోనే అద్భుతం చేసి చూపించారు. 2021 సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించారు అని కేటీఆర్ అన్నారు
ఇకపోతే , బోర్డర్– గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటింది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించిన భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. గబ్బా టెస్టులో విజయంతో 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.