ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ గెలుపొందినప్పటికీ.. తీన్మార్ మల్లన్న మాత్రం హీరోగా నిలిచాడు. గణనీయంగా ఓట్లు సాధించడమే అందుకు కారణం. తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానల్.. ఫేస్బుక్ వీడియోల ద్వారా తరచూ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఓ నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ ఘటనపై తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. సదరు నిరుద్యోగి ఆత్మహత్యయత్నానికి కేటీఆర్ దే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ‘ రాష్ట్రంలో నిరుద్యోగానికి కారణం కేటీఆరేనని, హన్మకొండ చౌరస్తాలో కేటీఆర్ ను ఉరితీయాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి. కేటీఆర్ నే ఈ స్థాయిలో విమర్శించడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రామ్‌సింగ్ తండాకు చెందిన బొండు సునీల్ అనే నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు. అందుకే తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నానంటూ అతడు సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు.
వెంటనే స్థానికులు అతడిని వరంగల్ మహాత్మా గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. సునీల్‌ను తీన్మార్ మల్లన్న పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ను గద్దె దించితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయంటూ మండిపడ్డారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ అనే ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసి దాని ద్వారా నిత్యం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో అతడికి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.