సీఎంపై డిప్యూటీ సీఎం పంచ్‌లు విన్నారా?

Update: 2017-06-26 04:13 GMT
రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధినేత ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ గుర్తున్నారు క‌దా. లాలూ ప్ర‌సాద్ గుర్తు లేక‌పోవ‌డ‌మేమిటి? త‌న‌దైన శైలిలో పాల‌న సాగించిన ఆయ‌న దాణా స్కాంలో గ‌డ్డి క‌రిచి జైలులో కూర్చుని కూడా సీఎం పీఠంపై త‌న భార్య‌ను కూర్చోబెట్టి పాల‌న సాగించిన ఆయ‌న‌ను దేశ ప్ర‌జ‌లు ఎలా మ‌రిచిపోతారు చెప్పండి. అయితే కేసుల్లో దోషిగా తేలిన ఆయ‌న ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూర‌మైనా... త‌న ఇద్దరు కుమారుల‌ను రాజ‌కీయ తెరంగేట్రం చేసి... వారిలో చిన్నోడిని బీహార్ డిప్యూటీ సీఎంను చేసేసి - పెద్దోడిని మాత్రం నితీశ్ కుమార్ మంత్రివ‌ర్గంలో కీల‌క శాఖ మినిస్ట‌ర్‌ గా చేసేశారు. ఇప్పుడు ఆయ‌న ఇద్ద‌రు కుమారులు బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వంలో త‌మ‌దైన శైలిలో ప‌ని చేసుకుంటూ పోతున్నారు. పెద్దోడు వివాదాల్లో కూరుకుపోతుంటే... చిన్నోడేమో త‌న ప‌నితీరుతో జాతీయ మీడియాను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాడు.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. గ‌తంలో లాలూ రాజ‌కీయాల్లో యాక్టివ్‌ గా ఉన్న స‌మ‌యంలో త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేందుకు ఏమాత్రం సంకోచించే వారు కాదు. ఆ మాట త‌న మిత్రులనే కాకుండా, త‌న‌పై బాసుల‌ను ఇబ్బంది పెట్టినా కూడా లాలూ త‌న నోటిని ఏమాత్రం అడ్డు చెప్పిన దాఖ‌లా లేదు. స‌రిగ్గా లాలూ లానే ఆయన చిన్న కుమారుడు - బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌... ఏకంగా త‌న బాస్‌ గా ఉన్న నితీశ్ కుమార్ తో పాటు బీహార్‌ లో త‌మ మిత్ర‌ప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీపైనా సెటైర్లు వేసే విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌తో ముఖాముఖీ మాట్లాడేందుకంటూ ఆలిండియా రేడియో కొత్త‌గా రూపొందించుకున్న *మ‌న్ కీ బాత్‌* కార్య‌క్ర‌మం త‌ర‌హాలో తేజ‌స్వీ యాద‌వ్ త‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో ముచ్చ‌టించేందుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా *దిల్ కీ బాత్‌* కార్య‌క్ర‌మాన్ని రూపొందించుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఇటీవ‌ల మాట్టాడిన సంద‌ర్భంగా తేజ‌స్వీ యాద‌వ్‌... త‌న బాస్ నితీశ్ కుమార్‌ తో పాటు త‌న మిత్ర‌ప‌క్షానికి చెందిన నేత రాహుల్ గాంధీల‌పై పెద్ద పంచ్‌ లే వేశారు. ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్‌ కు నితీశ్ మ‌ద్ద‌తు ప‌లికిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న నితీశ్‌... ఆ పార్టీకి వైరి వ‌ర్గంగా ఉన్న ఎన్డీఏ అభ్య‌ర్థికి మద్ద‌తిచ్చి చారిత్ర‌క‌ త‌ప్పే చేశార‌ని తేజ‌స్వీ త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేశారు. ఇక రాహుల్‌ పై సంధించిన పంచ్ విష‌యానికి వ‌స్తే... ఓ జాతీయ పార్టీకి ఉపాధ్య‌క్షుడిగా ఉన్న రాహుల్ గాంధీని ఆయ‌న పార్ట్ టైమ్ పొలిటీషియ‌న్‌ గానే అభివ‌ర్ణించారు. నితీశ్ - రాహుల్‌ ల‌పై తేజ‌స్వీ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేప‌డ‌మే కాకుండా... ఆ పార్టీల మ‌ధ్య ఉన్న సంబంధాల‌పైనా ప్ర‌భావం చూపే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News