కేసీఆర్‌కు ముంద‌స్తు భ‌యం.. రీజ‌నేంటి?

Update: 2021-10-18 08:30 GMT
ఎప్పుడు ఎన్నిక‌లు పెట్టినా.. తాను రెడీ అంటూ.. గ‌త పాల‌న స‌మ‌యంలో దూకుడుగా ప్ర‌క‌టించిన తెలంగా ణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఇప్పుడు మాత్రం ముంద‌స్తు లేద‌ని ప్ర‌క‌టించారు. అంతేకా దు.. ముంద‌స్తుకు వెళ్లాల్సిన ప‌రిస్థితులు రాష్ట్రంలో లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే.. దీనికి సంబం ధించి ఆయ‌న చెబుతున్న ప‌రిస్థితుల‌కు, క్షేత్ర‌స్థాయిలో ఉన్న ప‌రిస్థితుల‌కు తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉందని, చేయాల్సిన పనులూ ఇంకా చాలా ఉన్నాయని అందేకే ముంద‌స్తు ముచ్చ‌ట లేద‌ని కేసీఆర్ చెబుతున్నారు.

ఈ సమయంలో అన్ని పనులూ పూర్తి చేసుకుందామని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరిన్ని స్థానాలు గెలుచుకునేలా కష్టపడి పనిచేయాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. గత ఎన్నికలకు ముందు.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే తమకు కలిగే నష్టాన్ని తాను ముందే అంచనా వేశానని, అందుకే ముందస్తుకు వెళ్లామని తెలిపారు. రాజకీయంగా అప్పటి పరిస్థితుల గురించి తెలిసినందునే ఆ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఈసారి ఆ అవసరం లేదన్నారు. అయితే.. ఇక్క‌డ కేసీఆర్ చెబుతున్న ఈ కార‌ణాలు చిన్న‌వేన‌ని అంటున్నారు. ఎందుకంటే.. ఏపీలో ఒకే సారి పార్ల‌మెంటుకు, అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగినా.. ఊహించిందే జ‌రిగింది.

సో.. కేసీఆర్ ఇప్పుడు చెబుతున్న లెక్క‌లు స‌రైన‌వి కావ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఇప్పుడు ముంద‌స్తు వెళ్ల‌క‌పోవ‌డానికి ప్ర‌ధానంగామూడు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఒక‌టి.. క్షేత్ర‌స్థాయిలో కేసీఆర్ పాల‌న‌పై ఒకింత వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డం. స‌హ‌జంగానే రెండు సార్ల‌కు మించి.. తెలుగు రాష్ట్రంలో వ‌రుస‌గా ఏ ప్ర‌భుత్వాన్నీ ప్ర‌జ‌లు గెలిపించ‌లేదు. గ‌తంలో చంద్ర‌బాబును అయినా.. కాంగ్రెస్‌ను అఅయినా.. రెండు సార్ల‌కు మించి గెలిపించ‌లేదు. ఇప్పుడు కేసీఆర్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంటుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

ఇక‌, రెండో కార‌ణం.. కాంగ్రెస్ స‌హా.. బీజేపీలు పుంజుకున్నాయి. అటు కాంగ్రెస్ సార‌థి రేవంత్ రెడ్డి, ఇటు.. బీజేపీ సార‌థి బండి సంజ‌య్‌లు దూకుడుగా ఉన్నారు. ప్ర‌జ‌ల్లో నిత్యం తిరుగుతున్నారు. స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేస్తున్నారు. ఇది స‌హ‌జంగానే ఆయా పార్టీల‌కు ప్ల‌స్‌గా మారింది. ఈ ప‌రిస్థితిలో ముంద‌స్తు కు వెళ్తే.. కేసీఆర్‌కు బెడిసికొట్టే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో సీఎంగా తానే చెప్పుకొన్న‌ట్టు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఇంకా నెర‌వేర్చాల్సి ఉంది. వీటిని విస్మ‌రించి.. ఇప్ప‌టికిప్పుడు లేదా ఒక ఏడాది త‌ర్వాత‌.. ఎన్నిక‌లకు వెళ్తే.. ప్ర‌మాదం పొంచి ఉంద‌ని కేసీఆర్ బావిస్తున్నార‌ని.. అందుకే ముంద‌స్తుకు రెడీగా లేన‌నేసంకేతాలు ఆయ‌న పంపేశార‌ని అంటున్నారు.




Tags:    

Similar News