నీటి మీద రాతలకు.. కేసీఆర్ మాటలకు పెద్ద తేడా లేదన్న మాట..పలువురి నోటి నుంచి వస్తూ ఉంటుంది. అవసరానికి ఎవరితోనైనా రాసుకుపూసుకు తిరగే అలవాటున్న ఆయన.. అవసరం లేదన్న వెంటనే వారిని ఎంతలా వదిలించుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీగా మారిన తర్వాత వామపక్ష పార్టీలను పట్టుకొని ఎన్నేసి మాటలు అన్నది తెలిసిందే. వారిని తోక పార్టీలు.. వెన్నెముక లేని పార్టీలుగా అభివర్ణిస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలను ఉద్దేశించి అంతటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయటమా? అన్న విస్మయం అప్పట్లో వ్యక్తమైంది.
కాలంతో పాటు మారే పరిస్థితులకు అనుగుణంగా.. తన మాటల్ని మార్చేసే విషయంలో గులాబీ బాస్ కు ఉన్న గొప్ప లక్షణం అందరికి తెలిసిందే. ఒకప్పుడు అదే పనిగా కమ్యునిస్టు పార్టీ నేతల్ని ఉద్దేశించి ఇష్టారాజ్యంగా తిట్టేసిన ఆయన నోటి నుంచే తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రం కలిసి పని చేస్తామని చెప్పారు. అంతేకాదు.. ఈ బంధం మరింతగా కొనసాగుతుందని.. జాతీయ రాజకీయాల్లోనూ కలిసి పోటీ చేసేలా వ్యవహరిస్తామని చెప్పటం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన వామపక్ష అగ్రనేతల్ని.. గంటల తరబడి వెయిట్ చేయించిన ఆయన.. చివరకు తనను కలిసే అవకాశం ఇవ్వకుండా వారిని వెనక్కి పంపించిన తీరుపై వామపక్ష నేతలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అధికారం కేసీఆర్ లో అహంకారాన్ని పెంచిందంటూ వారు నిప్పులు చెరిగారు. ఇప్పుడు అలాంటివన్నీ అటు కేసీఆర్ మర్చిపోయారు. ఆయన చేత మాటలు పడి.. అవమానాలకు గురైన వామపక్ష నేతలు మర్చిపోవటం విశేషం.
గతంలో కామ్రేడ్లను తాను అన్న మాటలకు కనీసం విచారం వ్యక్తం చేయని కేసీఆర్.. అవసరానికి ఎంతలా పూసేసుకుంటారో తాజా పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అయినా.. తమను ఉద్దేశించి దారుణాతి దారుణంగా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ తో.. ఆయనకు అవసరం వచ్చిన వేళ.. స్నేహం కోసం చేతులు జాస్తే సిగ్గు లేకుండా కలిసిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస ఆత్మగౌరవం కూడా కామ్రేడ్లలో లేకుండా పోతుందన్న మాట వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవటం ద్వారా నాలుగైదు స్థానాల్లో తాము గెలవొచ్చన్నకక్కుర్తి.. ఇంత దిగజారిపోయేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మునుగోడు ఎపిసోడ్ లో కేసీఆర్ తో జట్టు కట్టే వామపక్ష పార్టీల తీరు చూస్తే.. కనీస సిగ్గు కూడా లేదా? అన్న ఘాటు విమర్శలు పలువురి నోట వినిపిస్తున్నాయి.