మనసుకు నచ్చాలే కానీ కాకి కూడా అందంగా ఉంటుంది. అయినా.. కాకి అసలు అందంగా ఉండదని ఎవరంటారు? ఎప్పుడైనా నా కంటితో చూశారా కాకిని. వావ్.. ప్రపంచంలో అంత అందమైన జీవిని చూసిందే లేదు. ఎవడో మెడ మీద తల లేనోడు కాకి బాగోదంటే.. మనం గొర్రెల మాదిరి ఫాలో అవుతున్నాం. మనకంటూ ఆలోచించుకునేలా మనల్ని పెంచారా ఏంది? అంటూ మాట్లాడే వ్యక్తితో మనం ఏం మాట్లాడగలం. సరిగ్గా ఇలానే కాదు కానీ.. ఇంచుమించు ఇదే తీరులో మాట్లాడే ధోరణి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లో కనిపిస్తోంది ఈ మధ్యన.
తాజాగా ముఖ్యమైన పాత్రికేయులు కొందరితో కలిసి ఇష్టాగోష్టిని నిర్వహించిన మంత్రి కేటీఆర్.. బోలెడన్నిఅంశాల మీద మాట్లాడారు. తన టార్గెట్ ను అస్సలు మిస్ కాని రీతిలో ఆయన మాటలు ఉన్నాయి.
ఇంతకూ..ఆయన అలాంటి ఇష్టాగోష్ఠిని ఎందుకు నిర్వహించినట్టు? అంటే.. ఓవైపు వరుస పెట్టి సర్వేలంటూ తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల బలాల గురించి వార్తలు వచ్చేయటం.. మరోవైపు వరుస పెట్టి కురిసిన వర్షాలతో రాష్ట్రంలో ఎప్పుడూ కనిపించని జల ద్రశ్యం.. పొంగి పొర్లుతున్న గోదారి మహోద్రగ రూపం చూపిస్తున్న వేళ.. ఫీడ్ బ్యాక్ కోసం ఇలాంటి భేటీల్ని నిర్వహించటం మామూలే.
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. కొన్ని అంశాల మీద కేటీఆర్ సూత్రీకరణ చూస్తే మాత్రం.. కవరింగ్ చేసుకోవటంలో కొత్త కొత్త డిగ్రీలు పొందే టాలెంట్ ఆయనలో కొట్టొచ్చినట్లుగా కనిపించాయని చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య విభేదాల గురించి విలేకరులు ప్రస్తావించినప్పుడు.. ఆయన చెప్పిన మాటల్ని విన్నోళ్ల నోట మాట రాని పరిస్థితి. అంతలా చెప్పేస్తున్న కేటీఆర్ మాటలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంతకూ ఆయన నోటి నుంచి వచ్చిందేమిటో తెలుసా? 'మా పార్టీలో నేతల మధ్య అక్కడక్కడ విభేదాలు నిజమే.
అవి పార్టీ బలానికి సంకేతం. ఒక్కో నియోజకవర్గంలో ఒకరి కంటే ఎక్కువ బలమైన నేతలు ఉన్నారు. వారిమధ్య గొడవలు టీఆర్ఎస్ లోని పోటీ తత్వాన్ని చాటుతున్నాయి. బలంగా ఉన్న నేతల్ని పార్టీ కలుపుకుపోతుంది. కొత్తగా వస్తామంటున్న వారిని చేర్చుకుంటున్నాం. ఎవరినీ బలవంతం చేయటంలేదు. కేసీఆర్ సిద్ధాంతాలు నచ్చిన వారంతా పార్టీలోనే ఉంటారు. ఎవరైనా వెళ్లిపోతే అది వారి ఖర్మ' అంటూ తనదైన రీతిలో చెప్పుకున్నారు.
ఎక్కడైనా విభేదాలు అన్నవి.. అందునా రాజకీయ పార్టీలకు అదో బలహీనతలా.. లోపంగా భావిస్తారు. అందుకు భిన్నంగా.. అదే తమ బలంగా చెప్పుకునే వారితో ఎవరు మాత్రం ఏం మాట్లాడగలరు. ఐదు వేళ్లు ఉండాల్సిన చేతికి ఆరో వేలు ఉండటం ఎంత అందమో అని మాట్లాడితే ఎలా ఉంటుందో.. నేతల మధ్య విభేదాల విషయంలో కేటీఆర్ తాజా వ్యాఖ్యలు అలానే ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కేటీఆర్ కొత్త సూత్రీకరణను చూసినప్పుడు కొట్టుకు చావటం కూడా కలిసి ఉండటం.. అందునా బలానికి సంకేతం అంటే.. ఎవరు మాత్రం ఏమనగలరు? ఏమైనా.. ఈ తరహా కొత్త సూత్రీకరణలు రానున్న రోజుల్లో కేటీఆర్ నోటి నుంచి మరెన్ని వస్తాయో?