తలపండిన రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్యులు కూడా చెప్పేందేంటంటే..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అదృష్టం బలమైన ప్రతిపక్షం లేకపోవడమని. టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఒకే పార్టీగా పోరాడటంలో వైఫల్యం చెందడమే కాదు ప్రతిపక్షాల కూటమిగా కూడా విఫలమయ్యాయని అంటున్నారు. ఇందుకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉదంతమే నిదర్శనమని చెప్తున్నారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నిలబడి గట్టిగా పోరాటం చేయడంలో విపక్షాలు వెనుకబడ్డాయంటున్నారు. బాధిత రైతు కుటుంబాలకు అండగా మేమున్నాం అంటూ తొలుత టిడిపి - కాంగ్రెస్ - బిజెపి నేతలు ఉప్పెనలా ముందుకెళ్ళారు. ఆ తర్వాత ఆ విషయాన్నే మరిచారు. టీడీపీ ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి 48 గంటల పాటు దీక్ష నిర్వహించి - రైతుల్లో భరోసా నింపారు. అంతేకాదు ‘ఆట ఇప్పుడే మొదలైంది..’ అంటూ రేవంత్ వేసిన డైలాగ్ తో సభికులు - కార్యకర్తలు ఈలలు వేశారు. అంతే ఆ తర్వాత ఆ సంగతి మరిచారు! కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ - మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు సైతం ఒక రోజు ఆందోళన చేశారు. ఇదే రీతిలో బీజేపీ నేతలు కూడా ఒక రోజు ఆందోళన నిర్వహించారు. ఎప్పుడూ ఉద్రేకంగా ఆందోళనలు చేపట్టే వామపక్షాలూ నామమాత్రంగానే ఉద్యమించాయి.
అయితే ఈ పార్టీలు అంతటితో తమ ఆందోళనను సరిపుచ్చాయి. క్షేత్రస్థాయిలో ఆందోళనకు కొనసాగింపుగా మరో కార్యక్రమం చేపట్టడం కానీ లేక రాష్ట్ర రాజధానిలో కొత్త రూపం ఏదైనా ఇవ్వడం కానీ చేయలేదు. దీంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు వాసుల్లో ప్రతిపక్షాలంటే పట్టింపులేని వారిగా ముద్ర పడింది. తమ ఆందోళనను ఏ పార్టీ సీరియస్ గా పట్టించుకోలేదని స్థానికులు గుర్రుగా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే...ప్రతిపక్షాలే వాటంతట అవే వెనక్కు తగ్గాయనే భావనలో ఉన్న కేసీఆర్ అంచనా నిజమయిందని చెప్తున్నారు.