హైదరాబాద్ కి కరోనా భయం రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. గాంధీ హాస్పిటల్ లో చేరిన ఇండోనేసియాకి చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారించారని తెలుస్తుంది. దీనితో కరోనా సోకిన వ్యక్తిని గాంధీ హాస్పిటల్ లో క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూ పోతుండటం తో అధికారయంత్రాంగం తో పాటు జనం అలర్ట్ అయ్యారు. మాస్క్‌లు ధరిస్తూ.. శానిటైజర్లు వినియోగిస్తూ ఎవరికి వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకిందని, ఎయిర్ పోర్టుల్లో పక్కాగా తనిఖీలు, వైద్య పరీక్షలు జరిపితే ఇక్కడ నివసించే వారికి ముప్పు తప్పుతుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాలు చూస్తే ..పది మంది ఇండోనేసియన్లు భారత్ కు రాగా.. వీరిలో కరోనా లక్షణాలు కనిపించడం తో సోమవారం కరీంనగర్ నుంచి స్క్రీనింగ్ కోసం వీరిని హైదరాబాద్ తరలించారు. వీరిలో ఒకరికి కరోనా సోకినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, తెలంగాణలో తొలిసారిగా దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యువకుడిలో కరోనాను గుర్తించారు. దీని తో గాంధీ హాస్పిటల్ లో కరోనా భాదితుల కోసం స్పెషల్ గా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డ్ లో బాధితుడిని ఉంచి, చికిత్స అందించారు. ఆ తరువాత ఈ మద్యే అతనికి కరోనా నెగటివ్ రావడం అతడిని డీఛార్జ్ చేసారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన ఓ యువతి కరోనా బారిన పడింది. ఇటలీ నుంచి వచ్చిన ఆ యువతికి కరోనా సోకినట్లు తేలడం తో గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ... కేంద్రం లెక్కల ప్రకారం మన దేశంలో మంగళవారం మధ్యాహ్నం సమయానికి 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 134కి చేరింది. వీరిలో 111 మంది భారతీయులు కాగా.. 23 మంది విదేశీలు. ఈ 134 మందిలో 118 మంది చికిత్స పొందుతుండగా.. 13 మంది కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్లిపోయారు. ఇకపోతే ఇప్పటివరకు భారత్ లో కరోనా వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు విడిచారు.