తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి అరెస్ట్

Update: 2019-10-18 09:01 GMT
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసి , కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గత 14 రోజులుగా సాగుతూనేఉంది. ఈ సమ్మె పై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెని ఉదృతం చేయాలనీ భావిస్తుంది. ఇందులో భాగంగా రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ చేయబోతున్నారు.  రేపు ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కార్మికులతో కలిసి బైక్ ర్యాలీ చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి అనుకున్నారు. కానీ , అయన తలపెట్టిన బైక్ ర్యాలీకి ముందస్తుగా ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు అంటూ కొద్దీసేపటి క్రితం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు సిద్ధమవుతున్న సమయంలో అక్కడే అశ్వత్ధామరెడ్డి ని  పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అరెస్ట్ చేసిన నాయకులని , కార్మికులని నగర చివర్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ కి తరలించబోతున్నట్టు సమాచారం. అలాగే బస్ భవన్ వద్దకు కార్మికులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉండటంతో...అక్కడ  పోలీసులు బలగాలు భారీగా మోహరించారు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డిని అరెస్ట్ చేసి రేపు తలపెట్టిన బంద్ ని ప్రభుత్వం విచ్ఛిన్నం చేయాలనీ చూస్తుంది అని కొన్ని  కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మేము శాంతియుతంగా బంద్ చేయాలనీ భావిస్తుంటే ..ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుంది అంటూ మండిపడుతున్నారు..
Tags:    

Similar News