5జీ టెక్నాలజీ వైపు భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి 5జీ ట్రయిల్స్ ను మన దేశంలో నిర్వహించడానికి ఇప్పటికే కేంద్రం కావాల్సిన అనుమతులు జారీ చేసింది. వీటిపై టెలికాం సంస్థలు ఇప్పటికే ప్రయోగాలు చేపట్టాయి. అందులో ముఖ్యంగా ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియాలు సేవలను భారత్ అందించేందుకు ముందున్నాయి. ఈ సేవలు గానీ అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వేగం మరింత పెరుగుతుందని టెలికాం సంస్థలు ఇప్పటికే పేర్కొన్నాయి.
5జీ సేవలను ప్రజలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గత కొద్ది రోజుల నుంచి టెలికాం సంస్థలు కేంద్రానికి విన్నవించుకుంటున్నాను. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదో తరం సేవలను ప్రజలకు అందించేందుకు ఇందుకు సంబంధించిన స్పెక్ట్రమ్ ను వేలం వేయాలని భావిస్తోంది. అయితే ఈ వేలం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పెక్ట్రం కొనుగోలు వచ్చే ఏడాదిలో ఉండవచ్చని సమాచారం ఇచ్చారు. ఏప్రిల్ లేదా మే నాటికి స్పెక్ట్రమ్ ను వేలం వేయాలని ఆలోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ సంస్థ అయిన ట్రాయ్ కసరత్తును ముమ్మరం చేసిందని పేర్కొన్నారు. మొదటగా ట్రాయ్ నుంచి సమగ్ర నివేదిక అందిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. దీనిపై సిఫార్సులు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి ప్రారంభంలో అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు టెలికాం సంస్థలు భారీ నష్టాల్లో కూరుకుపోయినట్లు చెప్పిన కేంద్ర మంత్రి... 5జీ స్పెక్ట్రమ్ తో వాటికి మరింత లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 5జీ సాంకేతికతను ఇప్పటికే చాలా దేశాలు అంది పుచ్చుకున్న అని చెప్పినా వైష్ణవ్ భారత్లో కూడా వచ్చే ఏడాదికి ఈ సేవలను ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
టెలికమ్యూనికేషన్ రంగంలో తిరిగి భారీ స్థాయిలో లాభాలను ఆర్జించే దిశగా కేంద్రం చర్యలు చేపడుతుందని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. ప్రతి రంగంలోనూ నియంత్రణ వ్యవస్థలే ఆయా సంస్థల నష్టాలకు కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలను మరింత పటిష్టం చేసేందుకు మోదీ సర్కార్ నడుంబిగించిందని చెప్పుకొచ్చారు.
5జీ సాంకేతికత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సంబంధించిన చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది . ఇప్పటికే ఈ సాంకేతికతతో ముందడుగు వేస్తున్నా భారతావని ఐదో తరాన్ని అందిపుచ్చుకుంటే వివిధ రంగాల్లో సమూల మార్పులకు తెరతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టెలికాం రంగంలో కీలక మార్పులకు తెర తీస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే మూడేళ్లలో ఐదోతరం వెలుగులతో భారతావని వెలిగిపోతోందని చెప్తున్నారు.