జమ్ముకశ్మీర్ లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యం వేగంగా కదులుతున్న నేపథ్యంలో ముష్కరులు వక్రమార్గాలు పడుతున్నారు. ఇదే రీతిలో తాజాగా పాంపోర్ లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదులు చాకచక్యంగా వ్యవహరించడంతో వారి ఆచూకి దొరకలేదు.
ఆర్మీ అధికారుల సమాచారం ప్రకారం పుల్వామా జిల్లాలోని కద్లబాల్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను ఎదుర్కునేందుకు జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించగానే ముష్కరులు అక్కడి నుంచి పరారయ్యారని ఆర్మీ వర్గాలు వివరించారు. అయితే క్షుణ్ణమైన తనిఖీలు జరిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఆర్మీ వర్గాలు అప్రమత్తం చేశారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని, ఈ ఘటనకు తగిన విధంగా స్పందిస్తామని ఆర్మీ వర్గాలు వివరించాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జనాలు తీవ్ర భయాదోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తలదాచుకుంటున్నారు. పుల్వామా జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/