ప‌వ‌న్‌ పై చెప్పు!... టీజీ స్పంద‌న ఇదే!

Update: 2018-01-26 10:42 GMT
రాజ‌కీయ నేత‌లు చేసే అన్ని ప‌నులు జ‌నాల‌కు మేలు చేసేవిగానే ఉండాలి. ఇది రూలు. ఆ మాటకొస్తే... ఆయా నేత‌లు తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు - చేస్తున్న కామెంట్లు - వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కొంద‌రికి న‌చ్చితే... మ‌రికొంద‌రికి న‌చ్చ‌డం లేదు. అంటే రూలు ప్ర‌కారం నేత‌లు న‌డుచుకుంటున్న దాఖ‌లాలు ఇటీవ‌లి కాలంలో బాగానే త‌గ్గిపోయాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల స‌మ‌యంలో నేత‌ల నోట వినిపిస్తున్న హామీలు... ఆ త‌ర్వాత అమ‌లుకు నోచుకోని వైనాన్నే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. ఈ త‌ర‌హా ప‌రిణామాల‌తో జ‌నం కూడా అప్పుడ‌ప్పుడు తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు గుర‌వుతున్నారు. త‌మ‌ను నిలువునా ముంచేసిన నేత‌లుగా భావిస్తున్న వారిపై జ‌నం రాళ్ల‌తో పాటు చెప్పులు కూడా విసిరేస్తున్నారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల్లో నేత‌ల‌కు దెబ్బ‌లు తాక‌క‌పోయినా... ఆ ఘ‌ట‌న‌లు తీవ్ర క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉంటున్న నేత‌ల‌పై ప్ర‌జ‌లే రాళ్లు - చెప్పులేసే ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు మ‌న నేతాశ్రీల విశ్వ‌స‌నీయ‌త‌ను ప్ర‌శ్నించేవిగానే ఉంటున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు చాలా మంది నేత‌ల‌కు ఎదుర‌య్యాయి. టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి కూడా ఈ త‌ర‌హా విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన విష‌య‌మూ మ‌న‌కు తెలిసిందే. అయినా ఇప్పుడు ఈ చెప్పుల గోల ఎందుకంటే... టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పై మొన్న ఓ వ్య‌క్తి చెప్పు విసిరారు క‌దా. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఛ‌లోరే ఛ‌లోరే ఛ‌ల్ పేరిట యాత్ర సాగిస్తున్న ప‌వ‌న్‌... ఖమ్మం న‌గ‌రంలోకి ఎంట్రీ అవుతున్న సంద‌ర్భంగా ఓ వ్య‌క్తి ఆయ‌న‌పై చెప్పు విసిరేశాడు. క్ష‌ణ‌కాలంలోనే జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు చెప్పు ప‌వ‌న్ కు అయితే త‌గ‌ల‌లేదు గానీ.. ఆయ‌న కారు అద్దంపై ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే ఈ త‌ర‌హా దాడుల‌కు తానేమీ వెర‌వ‌న‌ని చెప్పిన ప‌వ‌న్ త‌న యాత్ర‌ను ముందుకు సాగించారు. ఇదంతా జ‌రిగిపోయిన ఘ‌ట‌నే అనుకున్నా... నిన్న ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ నేత‌ - మాజీ మంత్రి - రాజ్య‌స‌భ స‌భ్యుడు - ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త టీజీ వెంక‌టేశ్ చాలా ఆవేద‌న వ్యక్తం చేస్తూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

నేత‌ల‌పై చెప్పులు ప‌డితే.. వారికి అంత‌కంటే అవ‌మానం ఏముంటుంద‌ని ప్ర‌శ్నించిన టీజీ... ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ప్ర‌జాస్వామ్యంలో జ‌ర‌గ‌కూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్దారు. ఈ త‌ర‌హా దాడుల‌కు గురైన వ్య‌క్తులు ప‌వ‌న్ అయినా... ఇంకొక‌రైనా తీవ్రంగానే క‌ల‌త చెందుతార‌ని, ఈ విష‌యాన్ని గుర్తించాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని కూడా ఆయ‌న అన్నారు. అస‌లు ప్ర‌జ‌ల చేతుల్లో నుంచి నేత‌ల‌పై చెప్పులు ప‌డిపోయాయంటే... ఆ నేతాశ్రీలు చ‌చ్చిపోయిన‌ట్లుగానే భావించాల్సి వస్తుంద‌ని కూడా టీజీ మ‌రింత సంచ‌ల‌న కామెంట్ చేశారు. మొత్తానికి నేత‌ల‌పై చెప్పులేసే సంస్కృతికి జ‌నం తిలోద‌కాలివ్వాల‌ని, అప్పుడే ప్ర‌జాస్వామ్యం ఫ‌రిడ‌విల్లుతుంద‌ని టీజీ అభిప్రాయ‌ప‌డ్దారు. ఇక ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు పోలీసులు కూడా ఏదో ఆ చెప్పు వేసిన వ్య‌క్తి ప‌ట్టుకున్నాం - అరెస్ట్ చేశాం - మంద‌లించాం - కోర్టు హాజ‌రుప‌రిచాం అన్న కోణంలో కాకుండా స‌ద‌రు వ్య‌క్తుల‌పై క‌ఠిన శిక్ష‌లు ప‌డేలా చేస్తే ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కావ‌ని టీజీ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News