ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం.. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న తిరువూరులో రాజకీయం రసకందాయంగా మారింది. ఇక్కడ వైసీపీ తరఫున రక్షణ నిధి.. వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. దీంతో టీడీపీ ఒకింత వెనుకబడిందనే వాదన ఉంది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను ఇక్కడ నుంచి పోటీ చేయించినా.. టీడీపీ విజయం దక్కించుకోలేక పోయింది. నల్లగట్ల స్వామి దాసు గత ఎన్నికల వరకు యాక్టివ్‌గానే ఉన్నారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయన కూడా అనా రోగ్యం కారణంగా.. పార్టీ కార్యక్రమాలకు పెడ్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
దీంతో టీడీపీ తరఫున ఇక్కడ బలమైన వాయిస్ వినిపించే నాయకుడు లేకుండా పోయారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే.. వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న రక్షణనిధి గ్రాఫ్ పడిపోయిందనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.
ఆయన ఎక్కడా కనిపించడం లేదని.. ఆయన వల్ల పనులు కూడా కావడం లేదని.. స్థానికంగా.. నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ ఇక్కడ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుందా? అనేది సందేహంగా మారింది. అయితే.. ఇక్కడ కూడా.. వైసీపీకి నాయకుడు లేకపోవడం గమనార్హం.
ఇటు.. వైసీపీలోనూ.. అటు టీడీపీలోనూ.. ఇదే తరహా చర్చ సాగుతోంది. ఎస్సీనియోజకవర్గంలో సహజంగా.. ఇతర సామాజిక వర్గాలప్రభావం ఉంటుంది. అలా చూసుకున్నా.. ఇక్కడ టీడీపీకి కానీ.. వైసీపీకి కానీ... బలమైన ఇతర సామాజిక వర్గాల ప్రభావం కనిపించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కూడా బలమైన నాయకులు అయితే.. అవసరం అనేది లోకల్‌గా వినిపిస్తున్న టాక్. వైసీపీ మరోసారి రక్షణనిధికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. ఆయన గెలుపు కష్టమని.. టీడీపీ నేతలు భారీగానే అంచనాలు వేస్తున్నారు.
ఈ క్రమంలో తాము ఎవరిని నిలబెట్టినా.. గెలుపు మాత్రం తమకే దక్కుతుందని చెబుతున్నారు. ఈ పరిణామాలతో తిరువూరు నియోజకవర్గంలో రాజకీయాలు.. ఎటూ తేలకుండా.. పోయాయి. మరోవైపు.. టిడీపీ కానీ.. వైసీపీ కానీ.. ప్రజల మధ్య లేక పోవడం గమనార్హం. ఎవరూ కూడా పార్టీ తరఫున పెద్దగా ప్రజల మధ్యకు వెళ్లడం లేదు. ఎవరికి వారుగానే నాయకులు రెండు పార్టీలోనూ వ్యవహరిస్తున్నారు.. దీంతో తిరువూరు రెండు పార్టీలకు పెద్ద సంకటంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.