కుప్పలు కుప్పలుగా చచ్చిపడిన గబ్బిలాలు...భయాందోళనలో స్థానికులు!

Update: 2020-05-27 09:30 GMT
ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత  ఏ జివి  చనిపోయినా.. అది ఆ మహమ్మారి  వల్లనే అనే భయాందోళనలు కొనసాగుతున్నాయి. కాకులు..కుక్కలు..గబ్బిలాలు చనిపోవటం కరోనా వల్లనే అనే భయాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఈ తరుణంలో తాజాగా యూపీలోని గోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి వుండటాన్ని చూసిన ప్రజలు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక్కడికి సమీపంలోని బేల్ గాట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు పడివుండటాన్ని చూసిన స్థానికులు, కరోనా కారణంగానే అవి మరణించాయని భావించారు.

ఈసమచారం వెటర్నరీ డాక్టర్లకు తెలియటంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. గబ్బిలాలు చనిపోవటానికి  ఈ వైరస్ కారణం కాదనీ ఈ ప్రాంతంలో ఎండలు బాగా ఉండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతోనే గబ్బిలాలు మరణించాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని  డివిజనల్ ఫారెస్ట్ హెడ్ అవినాష్ కుమార్ వెల్లడించారు. అలాగే ఈ మరణాల గురించి అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

ఈ సమాచారం అందుకున్న ఖాజ్ని ఫారెస్ట్ రేంజర్ దేవేంద్ర కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎండ వేడికి తట్టుకోలేక అవి చనిపోయానని తెలిపారు. చనిపోయిన గబ్బిలాలను తదుపరి పరీక్షల కోసం వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు పంపించామని ఆయన తెలిపారు. అటూ బిహార్‌లో ఇలాగే జరిగింది. 200 వరకు గబ్బిలాలు మరణించాయి. కాగా కొన్ని రోజుల క్రితం మీరట్‌లోనూ ఇదే విధంగా గబ్బిలాలు చనిపోయి ఓ చెరువు గట్టుపై కనిపించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News