స్టేట్ సెక్యురిటి కమీషన్ (ఎస్ఎస్స్సీ)లో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు అవకాశం ఇవ్వాల్సిందే అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రస్ధాయి సెక్యురిటి కమీషన్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలంటూ ఓ పిటీషన్ హైకోర్టులో దాఖలైంది. పిటీషన్ పై బుధవారం విచారణ జరిగింది. ఎస్ఎస్ స్సీలో చంద్రబాబు పేరును చేరుస్తు నెలరోజుల్లో జీవో జారిచేయలంటూ హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేతపేరు స్టేట్ సెక్యురిటీ కమీషన్లో లేకపోవటం సుప్రింకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటీషన్ పై విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
అసలు స్టేట్ సెక్యురిటి కమీషన్ అనేది ఉందనే విషయం కూడా చాలామందికి తెలీదు. ఇందులో ప్రభుత్వం తరపునే కాకుండా ప్రతిపక్షం తరపున కూడా సభ్యులుంటారు. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్లో చంద్రబాబు పేరు లేదేమో. అందుకనే ఎవరో పిటీషన్ దాఖలు చేశారు. సరే ఏదేమైనా హైకోర్టు చంద్రబాబుకు అనుకూలంగా ఉత్తర్వులివ్వటం గమనార్హం.