రోటీన్ కు భిన్నంగా.. ప్రపంచంలోనే తొలిసారి సరికొత్త కండోమ్ అందుబాటులోకి వచ్చింది. మొదట్లో మగవారు మాత్రమే వినియోగించుకునేందుకు వీలుగా కండోమ్ లు వచ్చాయి.
ఆ తర్వాతి కాలంలో.. మహిళలు కూడా వాడేందుకు వీలుగా కండోమ్ లు వచ్చాయి. ఇలాంటివేళ.. మగ.. ఆడ అన్న తేడా లేకుండా ఎవరైనా సరే ఇట్టే వాడేసేందుకు వీలుగా రూపొందించిన కండోమ్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మలేసియాకు చెందిన జాన్ టాంగ్ అనే గైనకాలజిస్టు.. మిగిలిన వారికి భిన్నంగా ఆలోచించారు. మగ.. ఆడ అన్న తేడా లేకుండా అందరూ వాడేందుకు వీలుగా కండోమ్ ను రూపొందించాలన్న ఆలోచన చేశారు.
దీంతో.. స్త్రీ.. పురుషులిద్దరూ వినియోగించేందుకు వీలుగా ‘యూనిసెక్స్’ కండోమ్ ను రూపొందించారు. దీనిపై భాగంలో ఉండే ఎడ్ హెసివ్ ప్లాప్స్ వల్ల మామూలు కండోమ్స్ తో పోలిస్తే సుఖ వ్యాధుల నుంచి ఎక్కువ రక్షణ కలిగిస్తుందని చెబుతున్నారు.
ఈ కండోమ్ ను వండర్ లీఫ్ యూని సెక్స్ కండోమ్ గా పిలుస్తున్నారు. సాధారణ కండోమ్ లను లేటెక్స్ తో తయారు చేస్తారు. అయితే.. కొందరికి లేటెక్స్ ఎలర్జీ ఉండటంతో వాటిని వాడలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా పాలీ యురేథేన్ తో ఈ కండోమ్ లను రూపొందించారు. దీన్ని నిరభ్యంతరంగా వాడుకునే వీలుందని చెబుతున్నారు. తొలుత మలేషియా వాసులకు అందుబాటులోకి వచ్చే యూనిసెక్సు కండోమ్ లు.. తర్వాతి కాలంలో ప్రపంచం మొత్తం అందుబాటులోకి తీసుకురానున్నారు.