271కి చేరిన ఏలూరు బాధితుల సంఖ్య

Update: 2020-12-06 14:31 GMT
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. వీరి సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఇప్పటివరకు 117మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడకు తరలించారు. బాధితులకు వైద్య సిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు.

వైద్య బృందాలు ఇంటింటికి ఆరోగ్య సర్వే చేపట్టాయి. టెస్టుల కోసం శాంపిల్స్ సేకరిస్తున్నాయి. బాధితులకు ప్రాణపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అదనపు బెడ్ లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తాజాగా మంత్రి నాని పర్యవేక్షణో కలెక్టర్, అధికారులతో కమిటీ వేశారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీఎం కార్యాలయం నుంచి గంట గంటకు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు. సీఎం జగన్ సోమవారం బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.




Tags:    

Similar News