టాలీవుడ్ విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణమురళి.. చంద్రబాబు వ్యక్తిత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మధ్యలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ కూడా తీసుకొచ్చారు.చంద్రబాబు అవసరానికి మాత్రమే వాడుకుంటాడని.. అవసరం తీరిపోయాక విసిరి పారేస్తాడని తెలిపారు. పోసాని, పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే జరిగిందని ఆయన చెప్పుకొచ్చాడు.
2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ రెక్కలు ముక్కలు చేసుకొని తెలుగు దేశం పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. అప్పుడు ఆయన్ని స్టేజీపై కూర్చోబెట్టుకున్నారన్నారు. అదే పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికలకు ముందు లోకేష్ గురించి కామెంట్ చేసేసరికి తెలుగుదేశం నాయకులు అంతా ఆయనపై సీరియస్ అయ్యారని పోసాని మండిపడ్డారు.చంద్రబాబును పొగిడినప్పుడు బాగుంటారని.. తప్పులు ఎత్తిచూపితే మాత్రం రివర్స్ అవుతారని పోసాని మండిపడ్డారు. చంద్రబాబు మెంటాలిటీనే అంత అన్నారు.
2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని ఆ తర్వాత కరివేపాకులా తీసిపారేశాడని పోసాని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కావాలి కానీ.. ఆ తర్వాత వాళ్లకు ఎన్టీఆర్ అవసరం లేదన్నారు. అవసరం తీరిపోయిన తర్వాత తీసేసే గుణం బాబు దగ్గరే నేర్చుకోవాలంటున్నాడు ఆన.. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరో కాకముందు ఆయనతో ఎవరూ మాట్లాడలేదని.. ఒక్కరు కూడా పలకరించిన పాపాన పోలేదని చెప్పాడు.
ఎన్టీఆర్ ను అప్పట్లో చంద్రబాబుతో సహా అంతా ఓ అనాథలా చూసారని.. తారక్ ఏ మాత్రం రాజకీయ అనుభవం ఉన్నా కూడా తెలుగుదేశంలోకి 1శాతం కూడా రావాలని అనుకోడని పోసాని స్పష్టం చేశారు. ఆయనను వాడుకొని వదిలేశారని.. ఆయనెందుకు వస్తాడని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఇప్పుడు టాప్ హీరో అని.. జనాన్ని రప్పించగల నేత అని.. నారా లోకేష్ పని అయిపోయింది కాబట్టి ఎన్టీఆర్ ను రమ్మంటున్నారని పోసాని మండిపడ్డారు.