కుక్క కంటే హీనంగా ఉంది ఈ బతుకు అనే రోజుల నుంచి బతికితే ఆ కుక్కలా బతకాలి అనే రోజులు వచ్చాయి. అవును నిజమేనండి. ఈ డాగ్ స్టోరీ చదివాకా మీరు కూడా ఏకీభవిస్తారు. ఎందుకంటే ఆ కుక్క లైఫ్ అలా ఉంది మరి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రిదాకా పరుగులు పెడుతూ బతికితే నెలాఖరు వచ్చేసరికి ఖాళీ చేతులే మిగులుతున్న ఈ రోజుల్లో ఓ కుక్క దగ్గర మాత్రం వందల కోట్ల ఆస్తి ఉంది. ఆ డాగ్ ఏదో కాదు వరల్డ్ రిచెస్ట్ డాగ్ గుంథర్ VI. మరి ఈ కుక్కకు కోట్ల ఆస్తి ఎలా వచ్చింది? ప్రపంచంలో అత్యంత సంపన్నమైన డాగ్ గా ఎలా రికార్డు సాధించిందో తెలుసుకుందామా...?
గుంథర్ VIకు కోట్ల ఆస్తి ఉంది. అది కూడా వారసత్వంగా రావడం గమనార్హం. కుక్కలకు వారసత్వమా? అని ఆశ్చర్యపోవద్దు. ఈ కుక్కకు దీని తాత గుంథర్ IV నుంచి దాదాపు 500 మిలియన్ డాలర్లు అనగా రూ.3,715 కోట్ల ఆస్తి వారసత్వంగా లభించింది. ఇక నాటి నుంచి ఈ సంపద రోజురోజుకూ వృద్ధి చెందుతోంది. ఇంకేముంది గుంథర్ IV ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన కుక్కగా రికార్డెలకెక్కింది. ఈ సంపద గుంథర్ వంశస్థుల నుంచి దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇంతకీ ఈ కుక్కలకు ఆస్తి ఎలా ఆరంభమైందంటే... గుంథర్ III 1992లో మరణించింది. కాగా దాని యజమాని జర్మన్ కౌంటెస్ కార్లొట్టా లైబెన్‌స్టెయిన్ దీనికి 58 మిలియన్ డాలర్ల విలువ చేసే ట్రస్ట్ ను ఇచ్చారు. అనగా రూ.431 కోట్లు అన్నమాట. ఈ విధంగా కోట్ల రూాపాయల సంపద రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ భారీ సంపదకు గుంథర్ VI ఇప్పుడు యజమానిగా మారింది. ఇక వీటి యజమాని మృతి చెందిన తర్వాత హ్యాండర్లు వీటి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గుంథర్ VI తన టుస్కన్ విల్లాను అమ్మకానికి పెట్టింది. ఈ అత్యంత ఖరీదైన విల్లా భారీ రేటుకు పలుకుతోంది. దీనిని 2000వ సంవత్సరలో మడొన్నా నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంటే 21 ఏళ్ల కిందటే 7.5మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అంటే అప్పట్లోనే రూ.53 కోట్లు అన్నమాట. ఈ భారీ సౌధాన్ని 1928లో నిర్మించారట. ఈ భవనంలో తొమ్మిది బెడ్ రూంలు, ఎనిమిది బాత్ రూంలు, బయట స్విమ్మింగ్ పూల్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.
ఈ ఇంటిని అమ్మే బాధ్యతను ది అసోలిన్ టీమ్ కు చెందిన రూతీ అండ్ ఏతాన్ అస్సౌలిన్ అనే సంస్థ చేపట్టింది. ఇకపోతే ఈ భవనం మొత్తం వారి నిర్వహణలోనే ఉంది. దీన్ని ఇప్పుడు విక్రయించగా రూ.238 కోట్లు పలుకుతోంది. అయితే దీనిపై ఆ సంస్థ నిర్వాహకురాలు రూతీ స్పందించారు. ఈ ఖరీదైన భవనానికి కుక్క యజమాని అని తెలిసి తాను షాక్ అయ్యానని అన్నారు. అంతేకాకుండా దీని గురించి మాట్లాడే సమయంలో గుంథర్ VI తన దగ్గరకు వచ్చిందని తెలిపారు. అది ముద్దుకూడా ఇచ్చిందని... అంటే ఆ భవనాన్ని తమకు అప్పగించడానికి అంగీకారం చెప్పినట్లుగా భావించానని ఆమె ఈ సందర్భంగా వివరించారు.
ఈ విధంగా గుంథర్ వంశస్థుల నుంచి కోట్ల ఆస్తి వాటి వారసులకు లభిస్తోంది. అది రోజురోజుకూ వృద్ధి చెందుతూ క్రమంగా కోట్ల రూపాయలలో విస్తరిస్తోంది. అలా వరల్డ్ రిచెస్ట్ డాగ్ గా ప్రసిద్ధి చెందింది. నిజానికి కుక్కలకు ఇంత ఆస్తి ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే ప్రస్తుతం ఈ రిచ్ డాగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు బతికితే ఆ కుక్కలా బతకాలి బ్రదర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కుక్కకు అంత సంపద ఉండడం అంటే మామూలు విషయం కాదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.