రాజకీయ నాయకుడు అన్నంతనే వైట్ అండ్ వైట్ లో దర్శనమిచ్చేస్తుంటారు. ఇప్పటి యూత్ లీడర్లు మినహాయిస్తే.. సీనియర్ నేతలంతా కూడా ఒకేలాంటి మార్కుతో కనిపిస్తుంటారు. పంచె కట్టునేతలు దాదాపు తెలుగు రాజకీయాల నుంచి నిష్క్రిమించేసి.. అయితే లాల్చీ ఫైజమా.. లేదంటే వైట్ అండ్ వైట్ లో దర్శనమిస్తారు.
మామూలు సమయాల్లో ఫిట్ గా కనిపిస్తూ.. బోలెడంత శక్తి సామర్థ్యాలు తమ సొంతమన్నట్లుగా వ్యవహరిస్తారు. తమపై ఉన్న కేసుల్లో దేనికైనా సరే జైలు అన్న మాట విన్నంతనే వారికున్న రోగాల చిట్టా బయటకు వచ్చి.. ఇన్నేసి జబ్బులు ఉన్నాయా? అనుకోకుండా ఉండలేం. ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలో ఒక స్పెషాలిటీ ఉండటమే దీనికి కారణం.
ఇప్పటికి గుర్తించలేదా? మేమే చెప్పేస్తాం. సైకిల్ నడుపుతున్న యూత్ లో.. వారిలో కలిసిపోయినట్లు గా కనిపిస్తారు డెబ్భై ప్లస్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కళ్లకు నల్లద్దాలతో మిగిలిన వారికి కాస్త భిన్నంగా ఉన్న ఆయన.
అంత హుషారుగా సైకిల్ తొక్కుతున్న వైనానికి ఫిదా కావాల్సిందే. అంత పెద్ద వయసులో సైకిల్ తొక్కటమే ఒక స్పెషల్ అయితే.. ఆయన అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు.
అదేమంటే.. ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలో పట్టణ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఏదో పాల్గొన్నామంటే పాల్గొన్నామన్నట్లు కాకుండా.. మిగిలిన వారితోపాటు 15 కిలోమీటర్లు ఎలాంటి అలసట లేకుండా హుషారుగా సైకిల్ తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. పేరుకు డెబ్భై ప్లస్ అనే కానీ.. ఆయన మనసు ఇప్పటికి ట్వంటీ ప్లస్ అన్నట్లుగా చెప్పక తప్పదు.
ఇంత పెద్ద వయసులోనూ కుర్రాడి మాదిరి ఫిట్ గా ఉండటం.. అది కూడా సమకాలీన రాజకీయాల్లో అంటే వావ్ ఇంద్రకరణ్ రెడ్డి అనుకోకుండా ఉండలేం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు కొరతే లేదు. ఈ స్థాయిలో ఉండి.. ఇంత వయసులోఇలాంటి ఫీట్ చేయగలిగిన రాజకీయ నేతగా ఇంద్రకరణ్ రెడ్డి మాత్రమే నిలుస్తారేమో?