ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చాలా అంశాలకు ఆమోద ముద్ర వేసింది. ఈ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2021-22కు ఆమోదం. ఇందుకోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. రైతులకు గిట్టుబాటు ధరల కోసం రూ.6 వేల కోట్ల ఖర్చు.
రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. జూలై 1, 3, 4 తేదీల్లో శంకుస్థాపన
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయం
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పోషించే వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ బీమా పథకానికి ఆమోదం. బ్యాంకు అకౌంట్ ఉన్న కోటి 20 లక్షల కుటుంబాలకు ప్రీమియం కూడా సర్కారు చెల్లించింది.
కడప జిల్లా ఊటుకూరులో ఖడక్ నాథ్ కోళ్ల హ్యాచరీకి ఆమోదం.
ఐటీ పాలసీ 2021-24 కు ఆమోదం.
ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లాలో జేఎన్‌టీయూ ఏర్పాటుకు ఆమోదం.
సీమ కరువు నివారణ పథకం కింద పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని చెరువులను నింపేందుకు నిర్ణయం. ఇందుకోసం రూ.864 కోట్ల కేటాయింపు.
అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ల్యాప్ టాప్ లు అందించేందుకు నిర్ణయం. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అందించనున్నారు.
మధ్యతరగతి వారికి జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల ఏర్పాటు. 150, 200, 240 గజాల చొప్పున మూడు కేటగిరీల్లో అందిస్తారు. లాటరీ ద్వారా ఇళ్లను కేటాయిస్తారు.
సమగ్ర భూ సర్వేలో వ్యవసాయేతర ఆస్తులకూ టైటిల్ డీడ్ ఇవ్వాలని నిర్ణయం.
వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి పీహెచ్ సీలోనూ 104 ఏర్పాటు చేయాలని నిర్ణయం. రూ.80 కోట్లతో 539 అంబులెన్స్ ల కొనుగోలుకు నిర్ణయం.
గ్రామ కంఠంలో భూమిలో నివసిస్తున్న వరికి యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయం.