కరోనా దెబ్బకి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, అన్ని పనులని పక్కన పెట్టి , కరోనా నియంత్రణే ద్యేయంగా ఎక్కడికక్కడ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్నాయి. చైనా లో ఈ కరోనా తగ్గుముఖం పట్టినా, మిగిలిన దేశాలలో కరోనా ఇప్పట్లో కంట్రోల్ అయ్యేలా కనిపించడం లేదు. కాగా, భారత్ లో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు భారత్ లో కరోనా భాదితుల సంఖ్య 250 కి దాటిపోయింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా అలజడి సృష్టిస్తుంది. ఇప్పటివరకు తెలంగాణలో 19 , ఆంధప్రదేశ్ లో 3 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇకపోతే , ఏపీలో తాజాగా కరోనా సోకిన వ్యక్తి విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు రైలులో ప్రయాణించి సామర్లకోటలో దిగినవారి కోసం ప్రస్తుతం గాలింపు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వారికి దగ్గు, జలుబు లాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలు చూస్తే ... షేక్ సత్తార్ పేరు గల విశాఖకు చెందిన వ్యక్తి మక్కా యాత్రను ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నాడు. అయితే , అతనికి కరోనా సోకిందని తేలడంతో ప్రస్తుతం విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నాడు.
అయితే , అతడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలులోని బీ–1 కోచ్ లో ఈ నెల 12న ప్రయాణించాడు. అతనితో పాటు మరికొంత మంది అదే బోగీలో ఉన్నారు. వారిలో నలుగురు సామర్లకోటలో దిగినట్లు తెలుస్తుంది. సత్తార్ ప్రయాణం చేసిన బోగి వారే కాబట్టి , వారికీ కూడా కరోనా సోకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసి, వారికోసం గాలిస్తున్నారు. అయితే, వారెవరనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీనితో ఆ జిల్లా యంత్రాంగం వారి కోసం జల్లెడ పడుతోంది. వైద్య, రెవెన్యూ శాఖల సమన్వయంతో ముమ్మరంగా గాలిస్తోంది. వారు సామర్లకోటకు చెందిన వ్యక్తులా? లేక కాకినాడ వాసులా? ఇతర ప్రాంతాలకు చెందినవారా అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. వారే స్వచ్ఛందంగా ముందుకొస్తే వైద్య పరీక్షలు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, లేనిపక్షంలో వారితో పాటు ఇతరులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి పేర్లు ఇవ్వాలని ప్రజలని కోరినట్లు అధికారులు చెప్తున్నారు.