విదేశాల నుండి వచ్చేవారు పెయిడ్ క్వారంటైన్ కి వెళ్లాల్సిందే !

Update: 2020-05-09 06:30 GMT
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇవ్వడంతో విదేశాల నుండి భారత్ కి వచ్చేవారు నేరుగా క్వారంటైన్‌ కే వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల విమానా శ్రయాలకు చేరుకోగానే పరీక్షలు జరుపుతారని, ఒకవేళ కరోనా లక్షణాలుంటే నేరుగా ఆసుపత్రులకు పంపుతారని కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. వైరస్‌ లక్షణాలు లేకపోయినా, కొద్దిపాటి లక్షణాలున్నా నేరుగా క్వారంటైన్ ‌కే వెళ్లాలని స్పష్టం చేసింది.

దీనికి  సంబందించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చినవారు సొంత ఖర్చులతోనే హోటళ్లు, లాడ్జీల్లో క్వారంటైన్‌ లో ఉండాలని తెలిపింది.  లాక్ ‌డౌన్‌ వల్ల విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. వృద్ధులు - గర్భిణులు - తీవ్ర వైద్య సమస్యలు ఉన్నవారు, భారత్‌ కు అత్యవసరంగా రావాల్సిన వారు తదితరులకు ప్రాధాన్యమిచ్చింది. అయితే స్వదేశానికి చేరుకున్న తరువాత 14 రోజులపాటు క్వారంటైన్‌ లో ఉండేందుకు అంగీకరించిన వారినే టికెట్‌ బుకింగ్‌ కు అనుమతించింది.

అలాగే, కరోనా లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అంగీకరించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు వారం రోజుల్లో శాన్‌ ఫ్రాన్సిస్కో - కువైట్ - లండన్ - యూఏఈలోని అబుదాబి - వాషింగ్టన్ - మనీలా - న్యూయార్క్ - షికాగో - కౌలాలంపూర్‌ ల నుంచి దాదాపు 2,350 మంది వస్తారని అంచనా వేశారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అరబ్‌ దేశాలు సహా మరికొన్ని దేశాల నుంచి వచ్చే వారిలో కొందరు పేదలు కూడా ఉన్నారు. అక్కడ పనిచేసే కార్మికులు - కూలీలూ ఉన్నారు. వారు హైదరాబాద్‌ లో దిగాక హోటళ్లలో సొంత ఖర్చులతో ఉండాలంటే కష్టం. కాబట్టి పేదలను తమ ఆధ్వర్యంలోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయిలో చర్చ జరిగింది.
Tags:    

Similar News