నేడే కీలకం: వైసీపీ - బీజేపీ అభ్యర్థులిద్దరూ ఒకేరోజు.. ఓకేసారి

Update: 2021-03-29 03:43 GMT
తిరుపతి లోక్ సభకు నిర్వహించనున్న ఉప ఎన్నికలో నేడు కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ఉపఎన్నిక బరిలో నిలుచున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు డాక్టర్ గురుమూర్తి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభలు ఈ మధ్యాహ్నం తమ నామినేషన్లు ఒకేసారి దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుకు వారు తమ నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు.

నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి తుదిగడువు మంగళవారంతో ముగుస్తోంది. దీంతో ఒకరోజు ముందే డాక్టర్ గురుమూర్తి, రత్నప్రబ ఈ మధ్యాహ్నానికి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అనంతరం గూడురు, సూళ్లురుపేట, సర్వేపల్లిలో వారు పర్యటించే అవకాశం ఉంది.

బీజేపీ తరుఫున రత్నప్రభ నామినేషన్ వేయనున్నారు. ఆమె తరుఫున ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పురంధేశ్వరి, సునీల్ ధియేధర్ తోపాటు కీలకనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. జనసేనాని పవన్ కళ్యాన్ వస్తాడా? రాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఆదివారమే తిరుపతికి చేరుకున్నారు. ఆయన నామినేషన్ లో పాల్గొననున్నారు.

ఇక రత్నప్రభ తరుఫున ప్రచారానికి పవన్ వస్తారని.. వారం రోజుల్లో ఆయన తిరుపతిలో పర్యటిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్రిముఖ పోటీ ఉండడంతో తిరుపతిలో ప్రచారం హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News