32 లక్షల వివాహాలు.. 4 లక్షల కోట్ల వ్యాపారం..ఇదీ ఇండియాలో పెళ్లిళ్ల బాజా

Update: 2022-11-07 15:12 GMT
పెళ్లి.. జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునే దీని కోసం భారతీయులు కోట్లు ఖర్చు పెడుతారు. అంబానీ నుంచి సామాన్యుడి దాకా పెళ్లిళ్లకు అందరినీ పిలిచి భోజనాలు.. గట్రా మంచి సంప్రదాయబద్దంగా చేస్తారు. కరోనాతో గడిచిన రెండేళ్లు భారీగా జరుపుకోని పెళ్లిళ్లు ఇప్పుడిప్పుడే అది సమసిపోయి కుదుటపడడంతో ఇక భారీగా జరుగుతున్నాయి. భారతదేశంలో వచ్చే పెళ్లిళ్ల సీజన్ లో ఏకంగా 41 రోజుల్లో 32 లక్షల వివాహాలు జరుగనున్నాయి. ఏకంగా ₹3.75 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని అంచనా..

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) ప్రకారం నవంబర్ 4 నుండి 32 లక్షల వివాహాలు జరగనున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) ప్రకారం భారతదేశంలో రాబోయే వివాహ సీజన్ వధువు, వరుడు వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా వివాహ పరిశ్రమకు కూడా మంచి సంతోషకరమైన సందర్భంగా మారింది. డిసెంబర్ 14 నాటికి కనీసం ₹3.75 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది.

2022లో వివాహ పరిశ్రమ కనీసం 200% వృద్ధి చెందుతుంది. రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి ప్రేరిత లాక్‌డౌన్‌ను ఎదుర్కొన్న తర్వాత ప్రజలు వివాహ వేడుకలను నిర్వహించడానికి.. పూర్తి చేయడానికి ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు.  "రాబోయే సీజన్‌లో ప్రసిద్ధ ఫంక్షన్ హాల్స్ అన్నీ ఇప్పటికే చాలా బుక్కయ్యాయి. ఎగువ మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ ఆఫ్‌బీట్ వేదికలను ఎంచుకుంటున్నారు. హెచ్‌ఎన్‌ఐలకు డెస్టినేషన్ వెడ్డింగ్‌లు ఇప్పటికీ ప్రాధాన్య ఎంపికగా మిగిలి ఉండగా, మా వేదికలు -వివాహాల వ్యాపారం ఈ సంవత్సరం 100% కంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తుంది" అని వెడ్డింగ్స్ & ఈవెంట్‌ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు.   ఢిల్లీ ఎన్సీఆర్ .. చుట్టుపక్కల ఉన్న 11 పెద్ద వివాహ వేదికలు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లోనే బుక్ అయినట్టు తెలిపారు.

అధికారిక రికార్డుల ప్రకారం, భారతదేశంలోని ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ ,మ్యారేజ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ స్టడీ నివేదిక ప్రకారం, ఈ 41 రోజుల్లో వివాహ రంగం విలువ ₹3.68 ట్రిలియన్‌లుగా అంచనా వేయబడింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) తన పరిశోధన సర్వే ఆధారంగా ఈ అంచనా వేసింది. 4,302 మంది వ్యాపారులు.. సర్వీస్ ప్రొవైడర్లతో 35 నగరాల్లో ఈ సర్వే జరిగింది.

ఈ సీజన్‌లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ఢిల్లీలోనే దాదాపు ₹75,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని సీఏఐటీ తెలిపింది.. గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపు 25 లక్షల వివాహాలు జరిగాయి. ఖర్చులు ₹3 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.

మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో మార్కెట్‌లలో పెళ్లి కొనుగోళ్ల ద్వారా దాదాపు ₹3.75 లక్షల కోట్లు వస్తాయి. పెళ్లిళ్ల సీజన్ తదుపరి దశ జనవరి 14 నుండి ప్రారంభమై జూలై వరకు కొనసాగుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News