తెలంగాణలో యాక్టివ్ అవుతున్న షర్మిలను టార్గెట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తండ్రి, మాజీ సీఎం వైఎస్ఆర్ ను లక్ష్యంగా చేసుకుంది. షర్మిలను దెబ్బకొట్టాలంటే వైఎస్ఆర్ ను తెరపైకి తేవాలని ప్లాన్ చేస్తోంది. గతంలో తెలంగాణ విభజనను అడ్డుకొని.. తెలంగాణకు రావాలంటే వీసా తీసుకోవాలని అన్న వైఎస్ఆర్ ను బూచీగా చూపి షర్మిలను దెబ్బకొట్టాలని చూస్తోంది.
వైఎస్ షర్మిల తెలంగాణలో దూకుడుగా వెళుతున్నారు. వైఎస్ఆర్ పాలన తీసుకువస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. రాజన్న రాజ్యం రావాలంటున్నారు. . అయితే షర్మిలను దెబ్బకొట్టాలంటే వైఎస్ఆర్ ను టార్గెట్ చేయాలని తాజాగా టీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రంగంలోకి దిగారు. వైఎస్ఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి వైఎస్ఆర్ తీరని ద్రోహం చేశారంటూ ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా చేయాలని అడ్డుపడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తానంటూ బెదిరించారని.. బ్లాక్ మెయిల్ చేశారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కారణంగానే నాడు తెలంగాణలో వందల మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు.
వైఎస్ఆర్ తెలంగాణ ద్రోహి అని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారులు, విద్యార్థులు పోరాటం చేస్తుంటే.. సోనియాను వైఎస్ఆర్ బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు. తెలంగాణ ఇస్తామని కాలయాపన చేస్తూ మాట దాటవేస్తూ సోనియాను ఏమార్చారని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ వైఖరి వల్ల తెలంగాణలో వందలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని మంత్రి వేముల వ్యాఖ్యానించారు.
వైఎస్ షర్మిలను ఈ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ టార్గెట్ చేసినట్టైంది. తెలంగాణను అడ్డుకున్న వైఎస్ఆర్ ను టార్గెట్ చేసి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు టీఆర్ఎస్ చేస్తోంది. ఇదంతా షర్మిల పార్టీని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని తెలుస్తోంది.
వైఎస్ఆర్ పై విషం చిమ్మి షర్మిలను చావుదెబ్బ తీసే ఎత్తుగడను టీఆర్ఎస్ అమలు చేస్తోంది. దీంతో వైఎస్ఆర్ ఫొటో పెట్టుకొని వెళుతున్న షర్మిల టీఆర్ఎస్ వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడ్డట్టు అయ్యింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.