టీఆర్ ఎస్ పార్టీలో ఎప్పుడూ కనిపించని సీన్ ఒకటి తాజాగా కనిపిస్తోంది. ఎవరినైనా టార్గెట్ చేసి.. దుమ్ము దులిపేలా అధినేత కేసీఆర్ మాట్లాడితే చాలు.. పండుగ వాతావరణం కనిపించేది. ప్రెస్ మీట్ అయిన తెల్లారి పత్రికల్లో అధినేత చేసిన వ్యాఖ్యలు.. వాటికి ప్రధాన పత్రికలు ఇచ్చిన కవరేజ్.. తమకు కలిగే రాజకీయ ప్రయోజనం గురించిన లెక్కలతో మునిగితేలటం గులాబీ దళానికి అలవాటు.
మొదటిసారి అందుకు భిన్నమైన పరిస్థితి పార్టీలో నెలకొందని చెబుతున్నారు. సుదీర్ఘ ఉద్యమ వేళలో ఎప్పుడూ చేయని పెద్ద తప్పును ఈసారి కేసీఆర్ చేసినట్లుగా టీఆర్ ఎస్ పార్టీ నేతల నోట వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపై కేసీఆర్ మాటల దాడిని ఎంజాయ్ చేసే గులాబీ నేతలు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా షాక్ తిన్నట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ నోటి నుంచి ఈ స్థాయిలో విరుచుకుపడతారన్న విషయాన్ని ఏ మాత్రం ఊహించని టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడీ విషయం మీద స్పందించేందుకు సైతం ఇష్టపడటం లేదు. లోగుట్టు సంభాషణల్లో కోదండం సార్ మీద ఈ తిట్లేంది? పెద్దాయనకు ఏమైంది? ఎందుకంత ఆగ్రహం? తిడితే తిట్టొచ్చు కానీ మరీ అంత దారుణంగానా? మిగిలిన రాజకీయ నేతల్ని ట్రీట్ చేసినట్లుగా కోదండం మాష్టార్ని ట్రీట్ చేయటం ఏమిటి? దీని వల్ల జరిగే నష్టాన్ని కేసీఆర్ అంచనా వేసుకొనే అలా మాట్లాడారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకోవటం కనిపిస్తోంది.
మామూలుగా అయితే.. ఎవరినైనా టార్గెట్ చేసిన తర్వాత తమ అధినేత ఎంత మొనగాడన్న విషయాన్ని గొప్పగా చెప్పుకోవటంతో పాటు.. అధినేత తెలివిని కీర్తించుకోవటం కనిపిస్తుంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఈ తిట్టేంది? ఆ కోపమేంది? అంటూ తల పట్టుకోవటం కనిపిస్తోంది. కోదండం మాష్టార్ని తిట్టటం చేయకూడని తప్పుగా పలువురు గులాబీ నేతలు అభివర్ణించటం కనిపిస్తోంది. సొంతోళ్లకే ఇంతగా షాకిచ్చిన కేసీఆర్ మాటలు.. తెలంగాణ సమాజానికి మరెలా అనిపిస్తాయన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.