ఇటీవల ముగిసిన గ్రేటర్ ఎన్నికల్లో చాలానే విశేషాలు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి గ్రేటర్ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ అధికారపక్షానికి కొన్ని షాకులు తప్పలేదన్న విషయం తాజాగా విడుదలైన గణాంకాల్ని పరిశీలిస్తే బయటకు వచ్చాయి. మొత్తం 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ పరిధిలో 99 డివిజన్లను సొంతం చేసుకొని రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి కొన్ని డివిజన్లలో ఆ పార్టీ భారీ షాక్ తప్పలేదని తెలుస్తోంది.
విజయం సాధించిన 99స్థానాల్ని మినహాయిస్తే.. మిగిలిన వాటిల్లో 15 డివిజన్లలో తెలంగాణ అధికారపక్షానికి డిపాజిట్లు గల్లంతు కావటం గమనార్హం. ఓపక్క ఎవరూ ఊహించనంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పార్టీకి చెందిన అభ్యర్థులు 15 చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోకపోవటం గమనార్హం. అదే సమయంలో.. ఆచితూచి ఎంపిక చేసుకున్న సీట్లలో మాత్రమే పోటీ చేసిన మజ్లిస్ కు ఇలాంటి అవమానమే మిగిలింది. ఆ పార్టీ గత గ్రేటర్ ఎన్నికలతో పోలిస్తే ఒక స్థానం అధికంగా గెలిచినా.. ఆ పార్టీ పోటీ చేసిన పరిమిత స్థానాల్లో 10 డివిజన్లలో డిపాజిట్లు కోల్పోవటం విశేషం.
మొత్తంగా గ్రేటర్ పరిధిలో 1333 మంది పోటీ చేస్తే వారిలో డిపాజిట్లు గల్లంతైన వారు 1009 మంది ఉండటం గమనార్హం. తక్కువగా ఓటింగ్ పోల్ కావటమే ఈ స్థాయి డిపాజిట్ల గల్లంతకు కారణంగా చెప్పొచ్చు. పోలైన ఓట్లలో అత్యధికం ఒకే పార్టీకి పడటం.. పోటీ చాలాచోట్ల త్రిముఖంగా జరగటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. అత్యధికంగా డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్థులు కాంగ్రెస్ (126) పార్టీకి చెందిన వారు కావటం ఒక విశేషమైతే.. తాను పోటీ చేసిన వాటిల్లో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే సొంతం చేసుకున్న టీడీపీ 36 డివిజన్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఇక.. బీజేపీ 20.. లోక్ సత్తా 25.. బీఎస్పీ 55 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.