తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన లాజిక్ లు బయటకు తీశారు. కేంద్రం తీరును నివేదికలతో కడిగి పారేశారు. బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకుల దిగజారుడు, దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తెలంగాణ వ్యాప్తంగా 3వేల పెన్షన్ ఇస్తామని దమ్ముంటే మోడీ, అమిత్ షా తో చెప్పించడని.. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టించుకోలేదన్నారు.
ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని.. ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించాలని కేసీఆర్ కృషి చేశారని హరీష్ వ్యాఖ్యానించారు.
ఫ్లోరైడ్ ఉంటే నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్ గా మారబోతోందని డబ్ల్యూ.హెచ్.వో చెప్పిందని.. కేసీఆర్ కు మునుగోడుపై ప్రేమ ఉంటుందా? మోడీపై ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను బీజేపీ అవమానపరిచిందని.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ధరలను పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని.. కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. వాటా తేల్చకుండా నల్గొండకు తీరని అన్యాయం చేసింది కేంద్రమని.. కృష్ణా జలాల్లో వాటా తేల్చని బీజేపీకి మునుగోడులో ఓటు హక్కు అడిగే హక్కు ఎక్కడిదని.. ప్రశ్నించారు.
పేదరికం దేశంలో పెరిగిందని.. ఆకలి పెరిగిందని ప్రపంచ దేశాల ముందు భారతదేశం పరువు పోయిందని.. పాకిస్తాన్ కంటే భారత్ లోనే ఆకలి ఎక్కువ అని జాతీయ సంస్థలు తేల్చాయని హరీష్ రావు అన్నారు. 8 ఏళ్ల బీజేపీ పాలనలో మొత్తం విఫలం అంటూ హరీష్ ధ్వజమెత్తారు.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలవాలా? రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలా? రాజగోపాల్ రెడ్డి గెలిచినా మునుగోడులో చేసేదేమీ లేదు అంటూ బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.