రష్యా కొత్తతరహా యుద్ధంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి

Update: 2022-06-05 05:08 GMT
యుద్ధరీతులు మారిపోతున్నాయి. సైనికులు క్షేత్రస్ధాయిలో తుపాకులతో పోరాడటం, శతృశిబిరాల్లోకి చొచ్చుకుపోవటం తగ్గిపోయింది. వైమానిక దళాలు, ట్యాంకర్లలాంటి ఆధునిక యుద్ధ రీతుల ఉపయోగం ఎక్కువైపోయాయి. ఇపుడు ఈ పద్దతులను కూడా దాటిపోయి రష్యా కొత్తతరహా యుద్ధం మొదలుపెట్టింది. అదేమిటంటే ఎలక్ట్రానిక్ యుద్ధం. అవును వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే వాస్తవం. ఎలక్ట్రానికి యుద్ధంతోనే ఉక్రెయిన్ కు చెందిన సైనిక కమాండర్లలో కొందరిని చంపేసింది.

ఉక్రెయిన్ కమాండర్లలో ఒకిరికి ఆయన తల్లినుండి వైర్ లెస్ ఫోన్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడటానికి కమాండర్ రెడీ అవ్వగానే రష్యాన్ మిస్సైల్స్ వచ్చి కమాండర్ ఉన్న భవనంపైన పడ్డాయి. దాంతో సదరు కమాండర్ తో పాటు మరికొందరు సైనికులు కూడా  చనిపోయారు. ఎక్కడో చాలా జాగ్రత్తగా నిఘా, భద్రతా దళాల మధ్య హైడౌట్ లో ఉన్న కమాండర్ ఆచూకీ ఎలా తెలుసుకున్నది ? ఎలా మిస్సైల్ ఎటాక్ జరిగింది ? ఎలాగంటే ఎలక్ట్రానిక్ యుద్ధం కారణంగానే.

అసలు ఎలక్ట్రానిక్ యుద్ధమంటే ఏమిటి ? ఏమిటంటే ఉక్రెయిన్ సైనిక కమాండర్లు, అత్యంత ప్రముఖులను కనిపెట్టేందుకు రష్యా మూడు రకాల పద్దతులను అనుసరిస్తోంది. మొదటిదేమో ప్రత్యర్ధి బలగాలను ఆరాతీయటం, రెండోది సొంత బలగాలను రక్షించుకోవటం, శతృవుల ఎలక్ట్రానిక్ సంకేతాలపై నిఘావేసి పట్టుకుని డీకోడ్ చేయటం ద్వారా రహస్యాలను ఛేదించటం. ఇందులో మూడో పద్దతిలోనే ఉక్రెయిన్ కమాండర్ ను రష్యా సైన్యం గుర్తించి మిస్సైల్ ఎటాక్ చేసింది.

ఉక్రెయిన్ రేడియో, సెల్ ఫోన్, రాడార్ వ్యవస్ధల ద్వారా వెళ్ళే సంకేతాలు, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్ధను జామ్ చేయటంలో రష్యా చాలా స్పీడుగా ఉందట. ఈ సాంకేతికత రష్యాకు చాలాకాలంగా ఉన్నప్పటికీ తాజా యుద్ధంలో మాత్రం ఇపుడే వాడటం మొదలుపెట్టింది. ఉక్రెయిన్ కు అమెరికా, బ్రిటన్ తో పాటు నాటో దేశాలే కాకుండా ఎలన్ మస్క్ అందిస్తున్న శాటిలైట్ సేవలను కూడా రష్యా అడ్డుకుంటోంది. ఉక్రెయిన్ కమాండర్ల మోబైల్ నెంబర్లను తెలుసుకుని, వాళ్ళంటున్న రహస్య ప్రాంతాల ఆచూకీ కనుక్కుని వెంటనే తమ దగ్గరున్న సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాప్ చేస్తోంది. కమాండర్ల కుటుంబసభ్యుల నుండి ఫోన్ వచ్చినట్లు మాట్లాడుతోంది. ఎప్పుడైతే కమాండర్లు లైన్లోకి వస్తున్నారో వెంటనే మిస్సైల్ ఎటాక్ చేస్తోంది. మరీ కొత్త తరహా యుద్ధం ఎంతకాలం సాగుతుందో చూడాలి.
Tags:    

Similar News