రష్యా.. ఉక్రెయిన్ పై ప్రారంభించిన యుద్ధం 100 రోజుకు చేరుకుంది. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర బలమైన దేశాలతో కూడిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ఎన్ని ఎత్తులు వేసినా, హెచ్చరించినా, ఆంక్షలు విధించినా, బెదిరింపులకు పాల్పడ్డా రష్యా కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు. తాము అనుకున్న లక్ష్యాలే టార్గెట్ గా మును ముందుకే కదులుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ఐదో వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా అంగీకరిస్తుండటం విశేషం.
ఇప్పటికే రష్యన్లు ఎక్కువగా ఉండే తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా పట్టుబిగించింది. అలాగే సీవీరోదొనెట్స్క్ నగరంలో అత్యధిక భాగాన్ని స్వాధీనం చేసుకొంది. ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్ పై సైనిక చర్యను మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో ఉక్రెయిన్ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగి ‘రస్పుటిట్సా’ అనే భౌగోళిక మార్పు చోటు చేసుకొంటుంది. వేడి పెరిగి గట్టకట్టిన మంచు కరిగి నేలలు బురదమయం అవుతాయి. వీటిల్లో రష్యా ట్యాంకులు ప్రయాణించడం దుర్లభం. ఫలితంగా రోడ్లపైనే ప్రయాణించిన ట్యాంకులు కీవ్‌ను చుట్టుముట్టే క్రమంలో భారీగా నష్టపోయాయి. దీనికి తోడు రష్యా ట్యాంక్‌ల్లోని ‘జాక్ ఇన్ ది బాక్స్’ అనే డిజైన్ లోపాన్ని ఉక్రెయిన్ సేనలు సమర్థంగా వాడుకొన్నాయి. ట్యాంక్‌పై టర్రెట్ కింద తూటాలను భద్రపర్చే భాగంపై దాడులు చేసి దెబ్బతీశాయి.
నల్లసముద్రంలో రష్యా కీలక యుద్ధ నౌక మాస్కోవాపై ఉక్రెయిన్ క్షిపణులు దాడులు చేశాయి. దీంతో అతిపెద్ద నౌకల్లో ఒకటైన మాస్కోవా మునిగిపోయింది. దీంతో పశ్చిమ దేశాలకు చెందిన మీడియాకు రష్యాకు యుద్ధంలో తీవ్ర నష్టం జరిగాయని ప్రచారం చేశాయి. దాదాపు 20 వేల మంది రష్యన్ సైనికులు ఇప్పటివరకు మరణించారని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. రష్యాపై దాడికి వీలుగా ఉక్రెయిన్ కు అన్ని రకాల క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, యుద్ధ హెలికాప్టర్లను, భుజాలపై మోసుకుపోగల క్షిపణులను అందించాయి. దీంతో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లినా ఆ దేశం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన టార్గెట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.
రష్యా ఈ సారి ఇన్ఫర్మేషన్ వార్ఫేరును నమ్ముకోకుండా.. క్షేత్రస్థాయిలోకి చొచ్చుకుపోయింది. ఓవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై గురిపెడుతూనే.. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై దాడులను తీవ్రతరం చేసింది. తూర్పు, దక్షిణ ప్రాంతాలపై పట్టు సాధించింది. ఉక్రెయిన్‌లోని భారీ పారిశ్రామిక నగరమైన మేరియుపోల్‌ను స్వాధీనం చేసుకొని పశ్చిమ దేశాలకు రష్యా షాకిచ్చింది. దీంతో క్రిమియా ద్వీపం నుంచి డాన్‌బాస్ ప్రాంతం మీదుగా రష్యాకు ల్యాండ్ కారిడార్ ఏర్పడింది. డాన్‌బాస్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలపై యుద్ధం తొలినాళ్లలోనే రష్యా పట్టు సాధించింది. మరో పారిశ్రామిక నగరమైన సీవీరోదొనెట్స్క్ ఆక్రమణకు యత్నాలను రష్యా ముమ్మరం చేసింది.
మరోవైపు నాటో, యూరప్ యూనియన్ లో దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతిని నిషేధిస్తూ తీర్మానించాయి. రష్యా నుంచి వచ్చే దిగుమతుల్లో 90 శాతం దిగుమతులను ఆపేశాయి. అయితే ఓవైపు చైనా, మరోవైపు భారత్.. రష్యాను ఆదుకున్నాయి. పెద్ద మొత్తంలో ఈ రెండు దేశాలు రష్యా నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకున్నాయి. రష్యా కూడా చాలా తక్కువ ధరలకే భారత్, చైనాలకు చమురు సరఫరా చేసింది.
మరోవైపు తనపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలపై రష్యా కూడా అంతే స్థాయిలో ఆంక్షలు విధించింది. ఆయా దేశాల దౌత్యవేత్తలను రష్యా నుంచి బహిష్కరించింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లపై ఆంక్షలు విధించింది. పశ్చిమ దేశాల ఆంక్షలతో రష్యా రూబుల్ విలువ పడిపోకుండా చర్యలు చేపట్టింది. తమతో సన్నిహితంగా లేని దేశాలు చమురును కొనుగోలు చేస్తే రష్యన్ రూబుళ్లలోనే చెల్లించాలని షరతు పెట్టింది. రష్యా రూబుల్ కోలుకుంది.
కాగా ఇప్పట్లో రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. అందుకే అమెరికా.. ఉక్రెయిన్ కు 40 బిలియన్ డాలర్ల సైనిక, పౌర సాయాన్ని ఇప్పటికే ప్రకటించింది. వీటిల్లో దాదాపు 20 బిలియన్ డాలర్లకుపైగా సైనిక సాయం రూపంలో ఉక్రెయిన్‌కు ఇవ్వనుంది. ఇంత మొత్తంలో ఆయుధాలను కేవలం వారంలోనో.. నెలలోనే ఇవ్వడం అసాధ్యం. ఈ మొత్తం పూర్తిగా అందించాలంటే కనీసం కొన్ని నెలలు పట్టొచ్చు. అంటే అప్పటి వరకు యుద్ధం కొనసాగుతుందనే అమెరికా విశ్వసిస్తోంది.