ఏకే 47 పట్టిన ఉక్రెయిన్ బామ్మా..!

Update: 2022-02-17 08:36 GMT
ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. యుద్ధం చేసినంత పని చేసింది. కానీ దౌత్య విధానంలో  భాగంగా ఉన్నట్టుండి సేనలను వెనక్కి పిలిచింది. ఇందులో జర్మనీ పాత్ర చాలా కీలకమైందని చెప్పాలి. నిజానికి ఉక్రెయిన్ ను ఏకంగా స్వాధీనం చేసుకుందామని  పుతిన్ సర్కార్ గట్టి ప్రయత్నాలే చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న బలగాలను ఒక చోటుకు చేర్చింది.

అన్ని వైపుల నుంచి  ఈ నెల 16 తేదీ ముప్పేట దాడి చేయాలని భావించింది. ఇంతలోనే అమెరికా పెద్దన్న పాత్ర తీసుకోవడం.. జర్మనీని రంగంలోకి దింపడం. దాడి జరిగితే రష్యాపై వ్యాపార ఆంక్షలు కఠినతరం చేస్తామని ప్రకటించడం  ఇలా ఒక్కోక్కటి చక చక జరిగిపోయాయి. మొత్తానికి యుద్ధ వాతావరణానికి శుభం కార్డు పడిందని భావిస్తున్నారు.
 
రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తుందని ముందస్తు సమాచారం తో... అమెరికా ఆ దేశ ప్రజలను హెచ్చరించింది. కచ్చితంగా 16వ తేదీన మెరుపు దాడి జరుగుతుందని పేర్కొంది.  దీనిలో భాగంగానే అక్కడ ఉన్న అమెరికా సేనలను వెనక్కి వచ్చేయాలని కోరింది. అక్కడ ఉన్న తన ఎంబసీని కూడ తరలించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పందించారు. రష్యా దాడి చేసే విషయం తమకు తెలుసు అని చెప్పారు.

ఇందుకు పౌరులను  మానసికంగా సిద్ధం చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయిన దేశ ప్రజలు అందరూ కలిసే ఉండాలని కోరారు. దీనిలో భాగంగానే రష్యా దాడి చేస్తుందని భావించిన ఫిబ్రవరి 16ను దేశ ఐక్యత దినంగా ప్రకటించారు. ఇలాంటి సమయాల్లో ఉక్రెయిన్ లో ఉండే ప్రజలందరూ రంగంలోకి దిగారు. వారిలో ముసలి వారు కూడా ఉన్నారు. వీరంతా ఆయుధాన్ని చేతబట్టి కదం తొక్కారు. ఇలా ఓ వృద్ధురాలు సుమారు 79 ఏళ్ల వయసులో తుపాకి పట్టింది. అందులోనూ అది ఏకే 47.  

రష్యా దండెత్తి వస్తే.. సమాధానం చెప్పేందుకు సిద్ధం గా ఉండాలని ఆ బామ్మ భావించింది. ఇయితే  ఆ ముసలమ్మ ఏకే 47 పట్టి లక్ష్యం వైపు గురి పెట్టిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ  ఫోటోలను నెటిజన్లు విరివిగా షేర్ చేస్తున్నారు. అంతేగాకుండా వివిధ రకాలైన మీమ్స్ తో అదరగొడుతున్నారు.
 
ఓ మీడియా సంస్థ ప్రకారం రష్యా సైనికులు యుద్ధానికి మొగ్గు చూపుతున్నారని.. వారిని నిలువరించేందుకు ప్రతి ఒక్క పౌరుడు తుపాకీ పట్టాలని ఉక్రెయిన్ ప్రభుత్వం అత్యవసర పిలుపుని ఇచ్చిన నేపథ్యంలో ఈ ముసలమ్మ కూడా ఏకే 47 పట్టింది. యుద్ధం సంగతి ఎలా ఉన్నా కానీ ముసలమ్మ మాత్రం భలే ఫేమస్ అయ్యింది.
Tags:    

Similar News