జగన్ సర్కార్ పై ఉండవల్లి హాట్ కామెంట్స్

Update: 2020-12-22 13:05 GMT
పోలవరం ప్రాజెక్టుపై మరోసారి గళమెత్తారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. డీపీఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. పునరావాస ప్యాకేజీ నిధులపై రాజీపడితే ఏపీకి తీవ్ర ద్రోహం చేసిన వారు అవుతారని.. ఒకసారి నీళ్లు వచ్చాక ఎత్తు పెంచారా లేదా అని ఎవరూ పట్టించుకోరన్నారు. ఆ నీళ్లు అయిపోయాక అప్పుడు రోడ్ల మీదకు జనం వస్తారని.. అప్పటికీ జరగాల్సింది జరిగిపోతుందని ఉండవల్లి ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలవరంపై పోరాడాల్సిందేనని.. అలసత్వం వద్దని సూచించారు.

మనకు పోలవరం తప్పితే మరో మార్గం లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. మిగతా చోట్ల కొండలు ఉన్నాయని.. తాగునీటికి ఉపయోగించే ప్రాజెక్టులను అభ్యంతరం పెట్టడానికి లేదన్నారు. అయితే క్లాజ్ ఉపయోగించి తెలంగాణ ప్రాజెక్టులు కట్టాలని చూస్తోందని తప్పు పట్టారు. దీనిపై ఆంధ్రావాళ్లే మాట్లాడాలని.. కానీ వాళ్ల ఆస్తులు తెలంగాణలో ఉండడంతో ఎవరూ మాట్లాడడం లేదన్నారు.

తెలంగాణ వాడకపోతే మనకు నీళ్లు వస్తాయని.. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు లేవని.. పోలవరం పూర్తి అయ్యే వరకు తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పాలన్నారు. పోలవరం విషయంలో కేంద్రంతో ఏం సంప్రదింపులు జరిపారో జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు.

ఏపీకి ప్రత్యేక హోదా లేదని.. 2015లోనే కేంద్రం తేల్చేసిందని.. ఉద్దేశపూర్వకంగానే ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఉండవల్లి విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టులో 41 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలనే జగన్ నిర్ణయం సరికాదని ఉండవల్లి సూచించారు. ఆ ఆలచనలు చేయవద్దన్నారు. డీపీఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసుకోవాలని సూచించారు. ప్యాకేజీని కేంద్రంతో పోరాడి సాధించాలన్నారు. రాజీపడితే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వారు అవుతారని ఉండవల్లి జగన్ సర్కార్ ను హెచ్చరించారు.
Tags:    

Similar News