ఏపీ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ గా ఉన్నారని కేంద్రం కితాబు ఇస్తోంది. ప్రజలలో విశ్వాసం, సమర్ధత నిజాయతీ విషయంలో ఏపీ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారని కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం వెలువరించింది.
అంతే కాదు ఈ సదస్సుకు హాజరైన ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించడం విశేషం. అదే ఏపీ విషయానికి వస్తే విపక్షాలు పోలీసులనే టార్గెట్ చేశాయి. చంద్రబాబు అయితే తన ప్రతీ ప్రసంగంలోనూ ఏపీ పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కచ్చితంగా వారి సంగతి చూస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు.
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే అన్నీ జాగ్రత్తగా చూస్తున్నామని ప్రతీ పోలీస్ స్టేషన్ వారీగా వివరాలు తీసిమరీ తమ ప్రభుత్వం వస్తే జవాబు చెబుతామని అన్నారు. ఇక ఇదే విషయం మీద అచ్చెన్నాయుడు తానే తరువాత హోం మంత్రిని అని కూడా ప్రకటించారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే తాను హోం శాఖ తీసుకుని ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలో అమలు చేసి చూపిస్తాను అని అంటున్నారు. ఏపీ పోలీసుల తీరు దారుణం అన్నారు.
అంతే కాదు ఆయన ఏకంగా కొందరు పోలీసు అధికారుల మీద కోర్టులో కేసు కూడా వేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఏపీ పోలీసుల తీరుని తప్పు పడుతున్నారు. ఈ మధ్యనే ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ నేరస్థులు అయిన పాలకులకు సలాం చేయడమేంటి అని పోలీసులను నిలదీశారు. ఏపీ పోలీసులు విపక్షాన్ని కట్టడి చేస్తున్నారు అని మండిపడ్డారు.
తన పాదయాత్ర మొదలెడుతూనే లోకేష్ బాబు కూడా పోలీసుల మీద పెద్ద నోరు చేశారు. ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాస్తూ ఏపీ పోలీసులను వైసీపీకి ప్రైవేట్ సైన్యంగా మారారని ఘాటైన ఆరోపణలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలు ఇలా అన్ని పార్టీలూ ఏపీ పోలీసుల తీరుని ఏదో సందర్భంలో తప్పు పడుతూ వస్తున్నవే.
ఇలా కనుక చూస్తే ఏపీలో పోలీస్ వర్సెస్ విపక్షం అన్నట్లుగా కధ సాగుతోంది. ఇంకో వైపు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అటూ ఇటూ మాటల తూటాలు పేలుతున్న వేళ పోలీసులే మధ్యలో నలిగిపోతున్నారు. ముందు ముందు ఈ వేడి మరింతగా రాజుకునే పరిస్థితి ఉంది. అలాంటి వేళ పోలీసులకు కేంద్రం నుంచి కితాబులతో పాటు అరుదైన గౌరవం దక్కడంతో పెద్ద చర్చ సాగుతోంది.
ఏపీ పోలీసులు సమర్ధంగా పనిచేస్తున్నారు నిజాయతీగా ఉంటున్నారు అని కేంద్రమే ప్రశంసలు కురిపిస్తోంది. అలాగే ఏపీ పోలీసుల మీద ప్రజలలో విశ్వాసం బాగా ఉందని అంటోంది. మరి విపక్షం చూస్తే ప్రజల విశ్వాసం లేకుండా పోలీసుల పనితీరు ఉందని విమర్శిస్తున్నాయి. ఇదంతా చూస్తూంటే ఏపీలో ఉన్న బీజేపీ సహా విపక్షాల విమర్శలు అన్నీ రాజకీయ పరమైనవే అనుకోవాలా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే కేంద్ర నివేదిక ఎపుడూ పారదర్శకంగా ఉంటుంది.
పైగా బీజేపీ తాను పాలించే రాష్ట్రాలను సైతం పక్కన పెట్టి ఏపీ పోలీసులకు పెద్ద పీట వేయాలని ఎందుకు అనుకుంటుంది. సో రేటింగ్ బాగానే ఉంది కాబట్టే కేంద్రం ఈ అరుదైన గౌరవాన్ని పోలీసులకు ఇచ్చింది అనుకోవాలి. మరి ఇక మీదట కూడా ఏపీలో విపక్షం పోలీసుల మీద విమర్శలు చేస్తే పోలీసు అధికారుల సంఘం నుంచి గట్టిగానే రిటార్ట్ ఉంటుంది అని అంటున్నారు. అదే విధంగా ఏపీ ప్రభుత్వం కూడా పఒలీసులను కాచుకుంటూ విపక్షాన్ని అటాక్ చేస్తుంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.