చైనాలో పుట్టి ప్రపంచంలోని 212 దేశాలకు విస్తరించి యావత్తు ప్రపంచ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో అటు చైనా ప్రభుత్వంతో పాటు ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ప్రధాన ముద్దాయిలుగా బోనులో నిలబడాల్సిన పరిస్థితి. చైనా అయితే ఇప్పటికే తన తప్పును ఒప్పుకొనే విషయంలో తనదైన శైలి మార్గాలను అన్వేషించుకుని ఎలాగూ... తాను ఏం చెప్పినా తనను అనుమానిస్తూనే ఉవంటారన్నభావనతో ఏదేదో మాట్టాడేసింది. అయితే డబ్ల్యూహెచ్ ఓ మాత్రం ఈ ఆరోపణల నుంచి తప్పించుకునే మార్గం కనిపించక తంటాలు పడుతోంది. డబ్బ్యూహెచ్ ఓ మొత్తంగా ఈ విషయంలో దోషిగా తేలలేదు గానీ... ఆ సంస్థకు అధిపతిగా వ్యవహరిస్తున్న టెడ్రోస్ ఆడ్నమ్ మాత్రం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయారు. ఈ చిక్కుల్లో నుంచి తప్పించుకునేందుకు ఆయన ఇప్పుడు చీప్ ట్రిక్స్ ను కూడా మొదలెట్టేశారు.
కరోనా వైరస్ వూహాన్ లో ప్రస్థానం మొదలెట్టిన సమయంలో ఆ వైరస్ మానవుల నుంచి మానవులకు సోకదని టెడ్రోస్ స్వయంగా ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓ అధిపతిగా ఉన్న కీలక వ్యక్తి ఏదైనా మాట్లాడారంటే ముందూ వెనుకా చూసుకోకుండా మాట్లాడలేరు కదా అన్న భావనతో చాలా దేశాలు చైనాతో రవాణా సంబంధాలను కొనసాగించాయి. ఈ క్రమంలోనే వూహాన్ నుంచి కరోనా ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలకు విస్తరించింది. అయితే కరోనా వైరస్ మానవుని నుంచి మానవునికి సోకుతుందన్న విషయాన్ని ముందే పసిగట్టేసిన చైనా మాత్రం వూహాన్ తో తన ఇతర ప్రాంతాలకు సంబంధాలను పూర్తిగా కట్టడి చేసింది. ఫలితంగా కరోనాతో వూహాన్ మాత్రమే నానా ఇబ్బందులు పడగా... మిగిలిన చైనా మాత్రం అంతగా ప్రభావితం కాలేదు. అయితే టెడ్రోస్ మాటతో ఇతర దేశాలన్నీ కూడా కరోనా బారిన పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగానే డబ్ల్యూహెచ్ఓ పై యుద్ధం ప్రకటించారు, టెడ్రోస్ చేసిన పాపానికి డబ్ల్యూహెచ్ఓ కు నిధులిచ్చేది లేదని కూడా సంచలన ప్రకటన చేశారు.
ఇలాంటి సమయంలో ఈ వివాదం నుంచి తప్పించుకునేందుకు టెడ్రోస్ చీప్ ట్రిక్స్ ను ప్లే చేయడం ప్రారంభించారనే చెప్పాలి. తాను నల్ల జాతికి చెందిన వాడినన్న భావనతోనే అందరూ తనపై పడుతున్నారని, ఇది జాతి వివక్ష కిందకే వస్తుందని ఇప్పుడు టెడ్రోస్ ఓ వింత వాదనను వినిపిస్తున్నారు.నల్ల జాతి వాడిని అయినందుకు తాను గర్విస్తున్నానని, అయిీతే తన జాతిని ప్రస్తావిస్తూ చాలా మంది తనపై విరుచుకుపడుతూ జావి వివక్షకు పాల్పడుతున్నారని టెడ్రోస్ ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగని టెడ్రోస్... తనపై విరుచుకుపడుతున్న ట్రంప్ నూ టార్గెట్ చేసేశాురు. కరోనా విజృంభిస్తున్న వేళ... తనపై విమర్శలు ఆపి కరోనా వ్యాప్తి కట్టడిపైనా ట్రంప్ దృష్టి సారిస్తే మంచిదంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. మొత్తంగా తాను చిక్కుకున్న వివాదంలో నుంచి బయటపడేందుకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హోదాలో ఉన్న టెడ్రోస్ ఇలాంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడటం నిజంగానూ విడ్డూరమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.