మోడీపై అభిశంసన..?

Update: 2016-04-24 06:59 GMT
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌ లో రాష్ట్రపతి పాలనను విధించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొన్ని ఇతర ప్రతిపక్షాలకు పూర్తి మెజారిటీ ఉన్న రాజ్యసభను అందుకు వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. రాజ్యసభలో ఏకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలివిడత బడ్జెట్‌ సమా వేశాలు ప్రారంభమవుతుండడంతో రాజ్యసభలో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నారు.

       గత ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాలకు ముందుగా అరుణాచల్‌ ప్రదేశ్‌ లో, గత నెలలో తొలి విడత సమా వేశాలు ముగిసిన తర్వాత ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కేంద్ర పాలన కిందకు తెచ్చిన ఎన్డీఏ ప్రభుత్వచర్యలపై తొలి రోజునే రాజ్యసభలో చర్చను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ఇప్పటికే నోటీసిచ్చారు. దీనికితోడు, కేంద్ర ప్రభుత్వ చర్యను అభిశంసిస్తూ ఉత్తరాఖండ్‌ లో రాషట్రపతి పాలన విధింపును సభ తిరస్కరిస్తున్నట్లుగా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్‌ పక్ష ఉపనాయకుడు ఆనంద్‌ శర్మ సభాధ్యక్షునికి లేఖ రాయడం విశేషం. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వ చర్యను అభిశంసించాలన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనకు వామపక్ష పార్టీలతో పాటు జనతాదళ్‌ (యు) ఇప్పటికే తమ ఆమోదాన్ని తెలియజేశాయి. పార్టీలు సమాజ్‌ వాదీ పార్టీ - డీఎంకె - ఎన్‌ సీపీ - రాష్ట్రీయ జనతాదళ్‌ - తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర పార్టీలు కూడా ఎగువ సభలో అభిశంసన తీర్మానానికి అండగా నిలిచే అవకాశాలు లేకపోలేదు.

రాజ్యసభలో అభిశంసన ఎదుర్కొంటే మోడీకి అది అప్రతిష్ఠే అని చెప్పుకోవాలి. రాజ్యసభలో బలం తక్కువగా ఉండడం వల్లే తిప్పలు వస్తున్నాయని మోడీ భావిస్తున్నారు. ఈ ఏడాదిలో ఖాళీ కానున్న స్థానాల్లో బీజేపీ, మిత్ర పక్షాల సభ్యులు కొత్తగా వస్తే కానీ కష్టాలు తీరవని... అంతవరకు ఇబ్బంది తప్పదని గుర్తించి అబిశంసన ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News