ఏపీ కోసం చాలా చేసేశామంటున్న వెంక‌య్య‌

Update: 2017-03-06 07:20 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి కోసం కేంద్ర అందిస్తున్న స‌హాయ‌స‌హకారాల‌ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాశానికి ఎత్తేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి కోసం తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. ఒకటి రెండు మినహా విభజన హామీలన్ని నెరవేర్చామని తెలిపారు. విభజన చట్టంలో లేనివి కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. టీడీపీ-బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్‌కు మద్దతుగా విశాఖలో వెంకయ్యనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయ‌న పై వ్యాఖ్యాలు చేశారు.

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తున్నార‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ను వారు అభివృద్ధి చేస్తార‌నే తాను విశ్వ‌సిస్తున్న‌ట్లు వెంక‌య్య నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. ఇప్ప‌టికే కేంద్రం త‌ర‌ఫున కీల‌క‌మైన జాతీయ విశ్వ‌విద్యాల‌యాలు, ప్ర‌ముఖ సంస్థ‌లు, ప‌రిశోధ‌న కేంద్రాలు వంటివి ఏపీకి వ‌చ్చాయ‌ని చెప్పిన వెంక‌య్య నాయుడు త్వ‌ర‌లో మ‌రిన్ని ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌బోతున్నాయ‌ని చెప్పారు.

కాగా,  ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విశాఖలోనే మకాం వేసి, కార్పొరేట్‌ స్థాయి ప్రచారం చేస్తున్నారు. మూడు జిల్లాలకు చెందిన సుమారు వంద మంది ఇంజనీరింగ్‌ కళాశాలల కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఉన్నవీ, లేని అంశాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ బలపర్చిన  బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు మద్దతివ్వాలని కోరారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కావాలంటే మాధవ్‌ను గెలిపించుకోవాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News