సీఎం కావాలా.. సీఎం పోస్టు కావాలా

Update: 2017-03-27 17:30 GMT
అటు ప్రధాని నరేంద్ర మోడీ - ఇటు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇద్దరినీ మెప్పించడానికి వెంకయ్యనాయుడు ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. యూపీలో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ ఏపీలోనూ బలపడడానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది. అయితే.. టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి వస్తున్న ఈ ప్రమాదాన్ని గుర్తించి ఆ పార్టీలోని తన హోల్ అండ్ సోల్ మద్దతుదారు, కేంద్ర మంత్రి వెంకయ్య ద్వారా ఏపీపై బీజేపీ కన్ను పడకుండా ఉండాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. అదే సమయంలో తమ్ముడు తమ్మడే పేకాట పేకాటే అనే టైపు మోడీ, అమిత్ షాలో ఏపీలో విస్తరణకు భారీ ప్రణాళికలు రచిస్తుండడంతో వెంకయ్యకు సమస్యగా మారింది. పార్టీ నాయకత్వం మాట వినాలా.. లేదంటే చిరకాల మిత్రుడు చంద్రబాబు కోసం పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట. అంతేకాదు.. చంద్రబాబు కోసం ఆలోచిస్తే మోడీ వద్ద వ్యతిరేకత కొనితెచ్చుకోవాల్సి వస్తుందని.. అది తన కెరీర్ నే దెబ్బతీసే ప్రమాదముందని కూడా భయపడుతున్నారట. మరోవైపు మోడీ కూడా ఏపీ విషయంలో వెంకయ్యను విశ్వససించడం మానేశారని టాక్.
    
ఆంధ్రాలో బిజెపిని బ‌లోపేతం చేసే విష‌యంలో కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు అంత సానుకూలంగా ఉన్న‌ట్లుగా లేని విష‌యాన్ని కూడా బిజెపి అధినాయ‌క‌త్వం గుర్తించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడుతో ఉన్న సంబంధాల వ‌ల్ల ఆయ‌న‌ను కాద‌ని, బిజెపిని రాష్ర్టంలో విస్త‌రించ‌డం స‌రైంది కాద‌ని వెంక‌య్య అభిప్రాయంగా ఉంది. చంద్ర‌బాబు త‌మ‌ను కాద‌ని వెళ్ల‌ర‌ని, అన్ని విధాలుగా త‌మ‌తో స‌హ‌క‌రిస్తున్నార‌ని, ఇపుడు తెలుగుదేశం పార్టీకి బిజెపిని పోటీదారుగా నిలిపితే బాగుండ‌ద‌ని వెంక‌య్య తమ పార్టీ అధినాయకత్వం వద్ద చూచాయగా ప్రస్తావిస్తున్నా ఆ మాట గట్టిగా చెప్పలేకపోతున్నారట. అయితే... ఆ మాటను బలంగా చెప్పాలని.. మోడీ నజర్ ఏపీపై పడకుండా చూడాలని చంద్రబాబు ప్రెజర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
    
ఏపీలో ఇప్పుడు యాక్టివిటీ పెంచితే మంచి  స్పంద‌న వ‌స్తుంద‌నే యోచ‌న బిజెపి అధినాయ‌కత్వానికి ఉంది. గ‌తంలో మూడుసార్లు రాష్ర్టంలో బిజెపి ప‌రిస్థితిపై స‌ర్వే చేసుకున్న ఆపార్టీ యంత్రాంగం ఇపుడు స‌రైన స‌మ‌యం అని నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. కేంద్రం అవ‌స‌రం ఇపుడు రాష్ర్టానికి ఉంది. తెలుగుదేశం ప్ర‌భుత్వం గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలని ఎలాగూ నిల‌బెట్టుకోలేదు.ఈలోగా 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆంధ్రాలో పార్టీని బ‌లోపేతం చేస్తే బాగుంటుంద‌నేది బిజెపి అధినాయ‌కత్వం చేసిన యోచ‌న‌. కానీ.. వెంకయ్య ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.
    
అయితే.. వెంకయ్య మనసులో మరో ఆలోచన కూడా ఉండొచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. కాలం కలిసొచ్చి ఇదే ఊపులో ఏపీలో బీజేపీ సీట్లు గెలుచుకుంటే సీఎం పోస్టుకు వెంకయ్యనాయుడికి మించిన కేండిడేటే లేరు. దీంతో అలాంటి పరిస్థితే వస్తే తానే సీఎం కాబట్టి చంద్రబాబు కోసం అంతగా ఆలోచించాలా.. లేదంటే, గెలుస్తామో లేదో తెలియని ఏపీ కోసం చంద్రబాబును వదులుకోవాలో అర్థం కాక ఆయన తెగ మథనపడుతున్నారట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News