మోడీకి కొత్త పేరు పెట్టిన వెంక‌య్య

Update: 2017-03-11 13:35 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లయ‌న సంద‌ర్భంగా ఢిల్లీలో మీడియా సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ మోడీ తిరుగులేని నాయకుడిగా అన్ని వర్గాల ప్రజల అభిమానం చూరగొన్నారని  తెలిపారు. బీజేపీకి యూపీలో 39.6 - ఉత్తరాఖండ్‌ లో 46.5 శాతం ఓట్లు - మణిపూర్‌ లో 36.2 - గోవాలో 34 శాతం ఓట్లు రావ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు.  ఎన్నికల్లో అవకాశవాద కూటమిగా కాంగ్రెస్ - ఎస్పీ నిలబడ్డాయన్న ఆయన ఎస్పీ-కాంగ్రెస్ అపవిత్ర పొత్తును ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ప్రజల తీర్పును కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోతుందని.. ఆ పార్టీ నాయకత్వ లేమితో బాధపడుతోందన్నారు. కాంగ్రెస్ మరింత బలహీనపడుతోందని ఈ ఫలితాలతో వెల్లడి అవుతుందన్నారు. ఈవీఎంలో గోల్‌ మాల్ చేశామన్న మాయావతి ఆరోపణలు అర్థరహితమన్నారు. గోల్‌ మాల్ చేస్తే పంజాబ్‌ లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. కేంద్ర పథకాలు - అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఆకర్షించాయని తెలిపారు.

మోడీ అంటే.. మూడ్‌ ఆఫ్‌ డెవలప్‌ మెంట్‌ ఇండియా అని  వెంకయ్యనాయుడు సూత్రీక‌రించారు.  ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పేదల పెన్నిదిగా భావిస్తున్నారని అన్నారు. మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ప్రజల్లో బలపడుతోందన్నారు. కంచుకోట అమేథీలోనూ కాంగ్రెస్‌ పరాజయం పాలైందని వెంక‌య్య నాయుడు తెలిపారు. ఈ ప‌రిణామంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ మరింత బలహీనపడుతుందని విశ్లేషించారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును విపక్షాలు బలపర్చాల‌ని వెంక‌య్య నాయుడు కోరారు. కుల, మత, ప్రాంత శక్తులను ఎదిరించి మోడీ అన్ని వర్గాల అభిమానం పొందారన్నారు. మోడీని ప్రజలు పేదల పెన్నిధిగా భావిస్తున్నారని ఆయ‌న తెలిపారు. నల్లధనంపై పోరాటానికి విపక్షాలు వక్రభాష్యం చెప్పాయని విమ‌ర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి భయపెట్టేందుకు ప్రయత్నించారన్నారు. గోవాలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. విపక్షాలు కులం, మతాన్ని రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, కాంగ్రెస్‌ నాయకత్వ లేమితో బాధ పడుతోందని వెంక‌య్య నాయుడు ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News