బీజేపీ సీనియర్ నేత.. మోడీ సర్కారులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి టైం అయిపోయింది. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన ఆయన పదవీ కాలం ముగిసింది. తాజాగా ఆయనతో పాటు మరో 17 మంది (ఇతర పార్టీ సభ్యులు)కి ప్రధాని మోడీ.. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ.. డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్.. సభా నాయకుడు అరుణ్ జైట్లీ.. పెద్దల సభలో విపక్ష నేత గులాంనబీ అజాద్ సహా పలువురు నేతలు వారికి వీడ్కోలు పలికారు.
పదవీకాలం ముగిసిన 17 మందిలో వెంకయ్య వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆయనేం చేయనున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీలో ఒక నేతకు రాజ్యసభకు ఎంపిక కావటానికి రెండు దఫాలు మాత్రమే అవకాశం ఇస్తారు. వెంకయ్యకు మరోసారి అవకాశం ఇవ్వాలంటే.. పార్టీ రూల్స్ మార్చాల్సి ఉంది. మరి.. ఈ విషయంలో మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీకి వచ్చిన తనకు వెంకయ్య దన్నుగా ఉంటారని.. ఆయన తనకు పెద్ద సహాయకారి అంటూ వెంకయ్య మీద ప్రశంసల జల్లు కురిపించే మోడీ.. ఆయన్ను మళ్లీ రాజ్యసభకు ఎంపికయ్యేలా చేస్తారా? లేదా? అన్నది ఒక ప్రశ్న. విధేయతతో బీజేపీలో అంచలంచెలుగా ఎదిగిన వెంకయ్యను మోడీ ఏం చేయనున్నారన్నది ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తుంది. మరి.. వెంకయ్యను మోడీ ఏం చేయనున్నారన్నది కాలమే డిసైడ్ చేయాలి.