గుంటూర్ లోక్ సభ బరిలో బిగ్ షాట్?

Update: 2017-09-13 01:30 GMT
ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి చుట్టూ ఉన్న గుంటూరు లోక్ సభ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో కీలకం కానుంది. దీంతో అన్ని పార్టీలూ ఈ స్థానాన్ని గెలుచుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. పాలక టీడీపీ ఈసారి ఇక్కడి సిటింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ను అసెంబ్లీకి పోటీ చేయించి - ఆయన స్థానంలో నందమూరి కుటుంబం నుంచి ఎవరినైనా పోటీకి దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విపక్ష వైసీపీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి శ్రీకృష్ణదేవరాయులు పేరు వినిపిస్తోంది. ఈ శ్రీకృష్ణదేవరాయులు ఎవరా అని ఆశ్చర్యపోనవసరం లేదు... ఈయన విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు.
    
నిజానికి లావు రత్తయ్య కుటుంబం ఒకప్పుడు టీడీపీలో ఉన్నా ఆ తరువాత వైసీపీలో చేరింది. మొన్నటి ఎన్నికల్లో రత్తయ్య టీడీపీ నుంచి పోటీ చేయాలని.. గుంటూరు లేదా నరసరావుపేట నుంచి బరిలో దిగాలని అనుకున్నా చంద్రబాబు కటాక్షం దొరకలేదు. అనంతరం ఆయన వైసీపీలోకి వెళ్లారు. ప్రస్తుతం రత్తయ్య రాజకీయంగా యాక్టివ్ గా లేకపోయినా ఆయన కుమారుడు శ్రీకృష్ణదేవరాయులు మాత్రం నియోజకవర్గంలో తిరుగుతున్నారు.                ప్రస్తుతం గుంటూరు వైసీపీ ఇంచార్జిగా ఉన్న ఆయన పార్లమెంటు స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు.
    
రాజధాని ప్రాంత నియోజకవర్గమైన గుంటూరు లోక్ సభ ఎన్నిక అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆయనకు వైసీపీ నుంచి అవకాశం రావడం గ్యారంటీ అని వినిపిస్తోంది. పార్టీ నుంచి సంకేతాలు వెలువడడం వల్లే ఆయన స్పీడు పెంచారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.
Tags:    

Similar News