టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాడు. కెప్టెన్ గా మరో అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో అజేయ శతకంతో జట్టుకు సిరీస్ విజయాన్ని కట్టబెట్టాడు. ఈ క్రమంలో కరీబియన్ గడ్డ మీద విండీస్ జట్టుపై రెండు శతకాలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. గతంలో విండీస్ పై కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ ఒక సెంచరీ సాధించాడు. ఆ రికార్డును కోహ్లీ అధిగమించాడు. మొత్తంగా విండీస్ జట్టుపై కోహ్లీకిది నాలుగో సెంచరీ.
అయితే, కోహ్లీ వన్డే కెరీర్‌లో ఓవరాల్ గా ఇది 28వ శతకం. ఈ సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. 433 ఇన్నింగ్స్‌ల్లో జయసూర్య 28 శతకాలు సాధించగా, కోహ్లి కేవలం 181 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించడం విశేషం.
ప్రపంచ బ్యాట్స్ మెన్ లలో కోహ్లీకి ఛేజింగ్ లో మంచి పేరుంది. ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఏడో స్థానంలో నిలిచాడు. కోహ్లి ఛేజింగ్ లో 5159 పరుగులతో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే (5150 పరుగులు)ను వెనక్కి నెట్టాడు. జయవర్దనే తర్వాతి స్థానాల్లో అరవింద డిసిల్వా(5134) - ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(5074) ఉన్నారు.
విండీస్ పై తాజా శతకంతో ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ(18 సెంచరీలు) మరో రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు సచిన్(17) పేరిట ఉండేది.